Mallikarjun Kharge: ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి.. ఖర్గే కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీ చెబుతున్న వికసిత్‌ భారత్‌ వల్ల దేశ ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయని మల్లికార్జున ఖర్గే విమర్శించారు.ఇది కేవలం కొందరు సంపన్నుల ఖజానాను మాత్రమే నింపుతోందంటూ ఆరోపించారు. కోట్లాది మంది వద్ద ఖర్చు చేసేందుకు అదనపు ఆదాయం లేదన్నారు.

New Update
Mallikarjun Kharge

Mallikarjun Kharge

కాంగ్రెస్ (Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కేంద్ర ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ చెబుతున్న వికసిత్‌ భారత్‌ వల్ల దేశ ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయంటూ విమర్శించారు. ఇది కేవలం కొందరు సంపన్నుల ఖజానాను మాత్రమే నింపుతోందంటూ ఆరోపించారు. కోట్లాది మంది ప్రజల వద్ద ఖర్చు చేసేందుకు అదనపు ఆదాయం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌ సుంకాలు, వాణిజ్య అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 

Also Read :  యాక్షన్ తో దుమ్ములేపిన సల్లు భాయ్.. సికిందర్ టీజర్ చూశారా?

Also Read: వీడ్ని పట్టుకుంటే రూ.లక్ష మీ సొంతం.. పోలీసుల సంచలన ప్రకటన

'' మోదీ (PM Modi) జీ.. కోట్లాది మంది భారతీయులకు ఖర్చు చేసేందుకు అదనపు ఆదాయం లేదు. దేశ జీడీపీలో 60 శాతం కేవలం ప్రజలు ఖర్చు చేయడం పైనే ఆధారపడి ఉంది. 10 శాతం మంది మాత్రమే ఆర్థిక వృద్ధిని, వినియోగాన్ని పెంచుతున్నారు. మిగిలిన 90 శాతం మంది నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితి ఉంది. పన్ను చెల్లిస్తున్న వారిలో 50 శాతం మందికి దశాబ్ద కాలంలో వేతనం పెరగడం ఆగింది. గ్రామీణ వేతనాల పెరుగుదల కూడా అంతే ఉంది. 

Also Read: హిందీ వల్ల 25 నార్త్ ఇండియా భాషలు నాశనమయ్యాయి: స్టాలిన్

దేశ ప్రజల ఆదాయాలు పెంచడంలో ఎన్డీయే విధానాలు విఫలమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ సుంకాలతోనే పోరాడుతోంది. వాణిజ్యంలో కూడా అడ్డంకులు ఉన్నాయి. యువత నిరుద్యోగం ఊబిలో చిక్కుకుపోయింది. ద్రవ్యోల్బణం పట్టి పీడిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కూడా దక్కలేదు. మీరు చెబుతున్నటువంటి వికసిత్‌ భారత్ అనేది ప్రజల జేబులను ఖాళీ చేస్తోంది. కొద్దిమంది సంపన్నులు ఖజానా మాత్రమే నింపుతోందని'' మల్లికార్జున ఖర్గే అన్నారు.   

Also Read :  బంగ్లాదేశ్తో మ్యాచ్ రద్దు.. పరువు తీసుకున్న పాకిస్థాన్ !

Mallikarjun Kharge Key Comments

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు