ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి సౌర విద్యుత్ పొందేలా మోదీ ప్రభుత్వం పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి ఇప్పటివరకు దాదాపు 1.45 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని తాజాగా కేంద్రం వెల్లడించింది. అలాగే 6.34 లక్షల ఇన్‌స్టాలేషన్లు కూడా పూర్తి అయినట్లు కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ పార్లమెంటులో తెలిపారు. Also Read: తల్లికి బంగారం కొనిచ్చేందుకు.. ఏకంగా ఏటీఎంనే కొల్లగొట్టిన కొడుకు? 2023-2024 నుంచి 2026-27 ఆర్థిక సంవంత్సరం వరకు రూ.75,021 కోట్ల ఖర్చుతో ఈ పీఎం సూర్యఘర్ కింద కోటి ఇన్‌స్టాలేషన్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కీమ్‌కు సంబంధించిన జాతీయ పోర్టల్‌లో దాదాపు 1.45 కోట్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని.. 26.38 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని మంత్రి వెల్లడించారు. వీళ్లలో 6.34 లక్షల మందికి ఇళ్లపై రూప్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లు పూర్తి చేసినట్లు ఆయన రాజ్యసభలో తెలిపారు. Also Read: కొండ చరియలు విరిగిపడి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి అంతేకాదు 3.66 లక్షల మంది దరఖాస్తుదారులకు సబ్సిడీలు విడుదల చేశామన్నారు. ఇది 15 నుంచి 21 రోజుల్లో క్రమం తప్పకుండా విడుదలవుతుందని పేర్కొన్నారు. అయితే పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా గుజరాత్‌లో అత్యధికంగా 2,86,545 ఇన్‌స్టాలేషన్లు పూర్తయ్యాయని తెలిపారు. మహారాష్ట్రంలో 1,26,344 పూర్తయినట్లు చెప్పారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో 53,423 ఇన్‌స్టాలేషన్లు జరిగినట్లు స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. దేశంలో సౌరవిద్యుత్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 15న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. చాలామంది తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో వీటి వాడకం మరింత పెరుగతుందని నిపుణులు చెబుతున్నారు. Also Read: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్ అయిన పెద్ద పాదం మార్గం! Also Read: చెత్తతో నిండిపోయిన భూకక్ష్య..ప్రమాదంలో ఉన్నామంటున్న ఐరాస