Trump Tariffs: చల్ దొబ్బేయ్.. సుంకాల వేళ ట్రంప్‌కు మోదీ ఊహించని షాక్!

ట్రంప్‌ టారిఫ్స్ పెంపుపై భారత్ భయపడటం లేదని.. ట్రేడ్‌ డిస్ప్యూట్‌పై భారత్‌ తీవ్ర ఆగ్రహంగా ఉందని తెలుస్తోన్నట్లు వార్తలు వెలువడ్డాయి.  ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ట్రంప్ ప్రయత్నించగా మోదీ స్పందించడం లేదని సమాచారం.

New Update
Modi refused Donald Trump

Trump Tariffs

Trump Tariffs: 

అమెరికా(America), భారత్(India) మధ్య వాణిజ్య సంబంధాలు(Trade Relations) దిగజారుతున్నాయని జర్మన్ మీడియా పేర్కొంది. ట్రంప్‌ టారిఫ్స్ పెంపుపై భారత్ భయపడటం లేదని.. అమెరికాతో వాణిజ్య వివాదంపై ఇప్పటికే తీవ్ర ఆగ్రహంగా ఉందని వార్తలు వచ్చాయి. అయితే ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ట్రంప్(Donald Trump) యత్నించగా ఆయన స్పందించలేదని ఓ జర్మన్‌ మీడియా సంస్థ తెలిపింది. గత వారం రోజులుగా ట్రంప్‌.. మోదీకి 4 సార్లు కాల్‌ చేసినప్పటికీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని పేర్కొంది. 'ఫ్రాంక్‌ఫర్టర్ ఆల్గెమైన్ జైతుంగ్' అనే వార్తా సంస్థ ఈ సంచలన కథనాన్ని ప్రచురించింది. 

Also Read: నేటి నుంచే భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ల బాంబు.. ఇబ్బందుల్లో ఈ రంగాలు!!

దీనికి కారణం భారత్‌పై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లేనని ఆ పత్రిక పేర్కొంది. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకంతో పాటు, అదనంగా మరో 25 శాతం సుంకం విధించడంపై మోదీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయన ట్రంప్ కాల్స్‌ను పట్టించుకోవడం లేదని పేర్కొంది. మోదీ తన కోపాన్ని, ఆందోళనను తెలియజేయడానికే ట్రంప్‌‌తో ఫోన్‌లో మాట్లాడటానికి ఇష్టపడట్లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:ఉద్యోగం కోసం ఇక అమెరికా పోలేరు.. భారతీయులకు ఊహించని షాక్ ఇచ్చిన ట్రంప్

గతంలో ట్రంప్ ఇతర దేశాల అధినేతలతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత, ఆ సంభాషణల సారాంశాన్ని మార్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయని, ఆ ట్రాప్‌లో పడకుండా మోదీ జాగ్రత్త పడుతున్నారని జర్మన్ న్యూస్ పేపర్ రాసింది. జర్మన్ పత్రిక కథనాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, భారత ప్రభుత్వం తరఫున దౌత్యవేత్తలు అనధికారికంగా దీనిపై స్పందించినట్లు తెలుస్తోంది. ఇలాంటి సెన్సిటీవ్ మ్యాటర్లు మోదీ ఫోన్‌లో డీల్ చేయరని కొందరు అంచనా వేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు