/rtv/media/media_files/2025/08/27/tariff-on-india-2025-08-27-10-49-05.jpg)
tariff on India
భారత్‌పై ట్రంప్ విసిరిని టారిఫ్ బాంబు ఈరోజు నుంచే పేలనుంది. అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ ఉత్పత్తులపై 50 శాతం సుంకం విధిస్తూ తీసుకున్న నిర్ణయం భారత ఎగుమతిదారులకు పెద్ద షాక్‌గా మారింది. ఈ నిర్ణయం ఆగస్ట్ 27(బుధవారం) నుంచి అమలు అవుతుంది. ట్రంప్ మొదట ఇండియాపై 25శాతం టారిఫ్‌లు విధించాడు. తర్వాత రష్యా నుంచి ముడి చమురు, రక్షణ పరికరాల కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ప్రోత్సహిస్తోందని దాన్ని 50 శాతానికి చేశాడు. ఇది సుమారు $60.2 బిలియన్ల విలువైన భారతీయ వస్తువుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
US enforces 50% tariff on Indian goods, with DHS confirming an additional 25% levy from today.
— Business Standard (@bsindia) August 27, 2025
GTRI says two-thirds of exports hit, risking a 43% drop in shipments to the US and severe impact on labour-intensive sectors.@shreyanandi15#TrumpTariff#IndiaUSTrade… pic.twitter.com/A4oPJi461G
ముఖ్యంగా ఇండియాలో శ్రమ ఆధారిత రంగాలైన వస్త్రాలు, తోలు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, తివాచీలు, ఫర్నిచర్ వంటి వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, పెట్రొలియం ఉత్పత్తులకు దీని నుంచి మినహాయింపు ఉంది. ఉద్రిక్తతలతో చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలకు లాభం చేకూరవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నా.. ఆ దేశంపై అమెరికా 30 శాతం టారిఫ్‌లు మాత్రమే విధించింది.
VIDEO | Delhi: As a 50 per cent tariff on exports to the US is coming into effect from today, Congress MP Imran Masood says, “We have bowed down to America. Trump is constantly speaking against us, and India has not been able to say a word.”#TariffsOnIndia
— Press Trust of India (@PTI_News) August 27, 2025
(Full video… pic.twitter.com/YrD42kCJnC
భారతీయ ఎగుమతిదారులు ఇప్పటికే కొత్త ఆర్డర్లను కోల్పోతున్నారని, సుంకాల కారణంగా తమ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో పోటీపడలేకపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల వస్త్ర పరిశ్రమలో లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అఖిల భారతీయ వస్త్ర పరిశ్రమల సమాఖ్య (CITI) ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వ సహాయాన్ని కోరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఈ సవాల్‌ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అలాగే, జీఎస్టీ రేట్లను తగ్గించడం, ఇతర సంస్కరణలతో దేశీయ వినియోగాన్ని పెంచే ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తోంది. ఈ సుంకాల వల్ల అమెరికాకు ఎగుమతులు 40-50 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) అంచనా వేసింది.