Watch Video: స్వచ్ఛభారత్‌.. విద్యార్థులతో కలిసి చీపురు పట్టిన ప్రధాని

మహాత్మగాంధీ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా ఇందులో భాగం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రమంత్రులు జేపీనడ్డా, కిషన్‌ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

New Update
PM Modi with broom

మహాత్మగాంధీ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన ఎక్స్‌ వేదికగా పిలుపునిచ్చారు. ''నేను, నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛత అభియాన్‌లో భాగమయ్యాను. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాను. స్వచ్ఛభారత్ స్పూర్తిని ఈ చొరవ మరింత బలోపేతం చేస్తుందని'' ప్రధాని మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పిలుపుమేరకు పలువురు రాజకీయ నాయకులు కూడా బుధవారం ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read: ఏకంగా సుప్రీంకోర్టు సెట్ వేసి.. ఇలాంటి సైబర్ నేరం నెవ్వర్ బిఫోర్!

కేంద్రమంత్రులు జేపీనడ్డా, కిషన్‌ రెడ్డి, ముఖేశ్‌ మాండవీయ, రాజివ్‌రంజన్‌, అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ తదితరులు ఆయా ప్రాంతాల్లో పరిసరనాలను శుభ్రం చేశారు. ఇదిలాఉండగా.. 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ 'స్వచ్ఛ్‌ భారత్‌' కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరుగుదొడ్లను నిర్మించడం, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు