/rtv/media/media_files/2025/04/29/ufAIVCXADBUPsMF1pWEM.jpg)
పాకిస్తాన్ మాజీ మంత్రి దుస్సాహసానికి ఒడిగట్టాడు. పాక్, ఇండియా ఉద్రిక్త పరిస్థితిలో ఇండియా ప్రధాని మోదీ తల లేని ఫోటో ఎక్స్‌లో షేర్ చేశాడు. పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ అహ్మద్ హుస్సేన్ ఓ వివాదస్పద పోస్ట్ షేర్ చేశారు. తల లేని మోదీ ఫొటో Xలో షేర్ చేస్తూ.. గాడిద తల నుండి కొమ్ములు తప్పిపోయాయని విన్నాను, కానీ ఇక్కడ మోడీ తప్పిపోడని రాశారు. ఇదే పోస్ట్‌ను కాంగ్రెస్ పార్టీ అఫిషియన్ ఎక్స్ హ్యాండిల్ రీపోస్ట్ చేసింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య పెద్ద రాజకీయ దుమారం రేగింది. పహల్గామ్ దాడిపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని హాజరు కాలేదని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ తలలేని మోదీ పోస్ట్ రీట్వీట్ చేసింది. గయాబ్ అనే క్యాప్షన్‌తో కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. దీనిపై బిజెపి ఆగ్రహానికి గురైంది. మోదీ తల తీసి పాకిస్తాన్ మాజీ మంత్రి పోస్ట్ చేస్తే.. దాన్ని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిందని మండిపడుతున్నారు. #NaughtyCongress తో పాకిస్తాన్ మాజీ మంత్రి పోస్టర్ షేర్ చేశారు.
Also read: పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్.. ఇటుగా విమానం ఎగిరితే పేల్చపడేస్తాం!
Ooops Gadhay K sir se Seang Ghayeb suna tha yahan Modi sb Ghaib Hooo gaye:) #NaughtyCongress https://t.co/hUzuT9ko75
— Ch Fawad Hussain (@fawadchaudhry) April 28, 2025
దీంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రవాద ప్రతిధ్వని అని బిజెపి లీడర్లు ఆరోపిస్తున్నారు. బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తూ.. ఆ ట్వీట్ చిత్రాన్ని చూపించి, కాంగ్రెస్ పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తుందని అన్నారు. మన మధ్యే ఒక జాతీయ రాజకీయ పార్టీ ఉంది. కానీ మనం వారిని లష్కరే పాకిస్తాన్ కాంగ్రెస్ అని పిలిస్తే అది తప్పేం కాదని ఎక్స్‌లో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ ట్వీట్ చేసింది.
Also read: Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్.. కర్మణ్యేవాధికారస్తే అంటూ.. !
Congress flaunts a headless kurta to echo the extremist 'Sar Tan Se Juda' slogan, exposing its continuous slide into Muslim League 2.0 — divisive, desperate, and directionless.
— BJP (@BJP4India) April 29, 2025
Now that PM Shri @narendramodi has spoken the only language Pakistan understands, Islamabad’s official… https://t.co/hU5bhiPaf8
(congress-party | Modi headless photo | former Pakistani minister | x-posts | controversy | pakistan | latest-telugu-news)