IND-PAK WAR: యుద్ధంపై మోదీ సంచలన నిర్ణయం.. ప్రధాని ప్లాన్-B ఇదే?

భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత ఆదివారం ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్ హాజరైయ్యారు.

New Update

భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత ఆదివారం ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్ హాజరైయ్యారు. ఆపరేషన్ సింధూర్, కాల్పులవిరమణ ఒప్పందంతోపాటు సరిహద్దు భద్రత గురించి మీటింగ్‌లో చర్చించనున్నారు. అమెరికా సమక్షంలో శనివారం కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన పాకిస్తాన్ కొన్ని గంటల తర్వాతే బార్డర్ వెంట కాల్పలు జరిపింది. దీనిపై మోదీ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. పాకిస్తాన్  కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన తర్వాత మోదీ సమావేశం ఆసక్తికరంగా మారింది. దీనిపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందని యావత్ భారత్ ఎదురు చూస్తోంది. ఇండయా పాకిస్తాన్‌ని మరోలా దెబ్బకొడుతోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం పాకిస్తాన్ సైనికాధికారులతో భారత్ ఆర్మీ ఆఫీసర్లు చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. సరిహద్దు భద్రత, సైనిక చర్య సన్నద్ధత గురించి చర్చలు జరుగుతున్నాయి. సమావేశంలో ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకోనున్నారో చూడాలి. అమెరికాకు ఇచ్చిన మాట ప్రకారం పాకిస్తాన్‌పై దాడులు ఆపవేయాలా.. లేక పాక్ చేసిన చిల్లర పనికి బుద్ది చెప్పాల్సిందేనా.. శనివారం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య హై టెన్షన్ తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరగనున్నాయా..? చూడాలి.

(india pak ceasefire | India Pak Ceasefire Break | india pak war | pm modi | india | latest-telugu-news | pakistan )

Advertisment
తాజా కథనాలు