Modi-Putin: మోదీ-పుతిన్ సంయుక్త ప్రెస్‌మీట్.. రష్యన్‌ పౌరులకు బంపర్ ఆఫర్..

హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోదీతో కలిసి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరుదేశాధినేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.     

New Update
PM Modi in joint pressmeet with Putin

PM Modi in joint pressmeet with Putin

23వ భారత్‌-రష్యా వార్షిక సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోదీతో కలిసి ఆయన శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో ఇరుదేశాధినేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రష్యా పౌరుల కోసం త్వరలో ఈ-టూరిస్టు వీసా, గ్రూప్ టూరిస్టు వీసా సేవలను ప్రారంభిస్తామని తెలిపారు. కేవలం 30 రోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని.. ఉచితంగానే ఈ సేవలు అందిస్తామని పేర్కొన్నారు.       

అలాగే ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించేందుకు విజన్ 2030 డ్యాక్యుమెంట్‌పై సంతకాలు జరిగాయని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఇరుదేశాల్లో పలు వ్యాపార మర్గాలు తెరుచుకుంటాయన్నారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఐక్యమత్యం ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్‌, రష్యా ఇప్పటికే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయని తెలిపారు.ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడైనా, క్రోకస్ సిటీ హాల్‌లో జరిగిన దాడైన ఇవన్నీ కూడా ఒకే మూలం నుంచి వచ్చాయని అన్నారు. ఉగ్రవాదం అనేది మానవత్వ విలువలపై జరుగుతున్న ప్రత్యక్ష దాడని.. దీనికి వ్యతిరేకంగా అందరం ఏకమవ్వడమే గొప్ప బలమని పేర్కొన్నారు. 

మరోవైపు పుతిన్ మాట్లాడుతూ.. భారత్‌కు నిరంతరాయంగా ఇంధనాన్ని సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. భారత ఇంధన శక్తి అభివృద్ధి కోసం అవసరమైన చమురు, గ్యాస్‌, బొగ్గు ఇలా మరెన్నో వనరుల పంపిణీకి రష్యా ఒక నమ్మకమైన సరఫదారుగా ఉందని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను మరింత వేగంగా పెంచేందుకు తాము నిరంతరాయంగా ఇంధనాన్ని సరఫరా చేస్తుంటామని తేల్చిచెప్పారు.

ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని తెలిపారు. రక్షణ సహకరాన్ని కూడా మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. రష్యా దృష్టి పెట్టాల్సిన సవాళ్ల గురించి మోదీతో చర్చలు జరిపానని తెలిపారు. భారత్‌-యురేషియా ఆర్థిక సంఘం మధ్య స్వేచ్ఛా వాణిజ్య మండలాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. అలాగే భారత్-రష్యా క్రమంగా చెల్లింపుల కోసం తమ జాతీయ కరెన్సీలు వినియోగించే దిశగా కదులుతున్నాయని పేర్కొన్నారు. 96 శాతం వాణిజ్య చెల్లింపులు జాతీయ కరెన్సీలోనే జరుగుతున్నాయని చెప్పారు.  

అలాగే తనకు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాని మోదీతో పాటు భారత ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  రష్యా నుంచి పెద్దఎత్తున చమురు కొనుగోలు చేస్తోందని భారత్‌పై ఇటీవల ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో తాజాగా పుతిన్ తాము నిరంతరాయంగా భారత్‌కు ఇంధనాన్ని సరఫరా చేస్తామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

అలాగే తనకు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాని మోదీతో పాటు భారత ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  రష్యా నుంచి పెద్దఎత్తున చమురు కొనుగోలు చేస్తోందని భారత్‌పై ఇటీవల ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో తాజాగా పుతిన్ తాము నిరంతరాయంగా భారత్‌కు ఇంధనాన్ని సరఫరా చేస్తామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Advertisment
తాజా కథనాలు