Uttar Pradesh : 'ఉద్యోగం కావాలంటే నాతో పడుకో'..  రూమ్లో జరిగింది వీడియో తీసి!

ఉద్యోగాల ఇప్పిస్తానని యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ అధికారిని బజారుకు ఇడ్చింది 22 ఏళ్ల ఓ మహిళా విద్యార్థిని. దీంతో  లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో 60 ఏళ్ల ప్రభుత్వ ఆర్డర్లీని సస్పెండ్ చేశారు

New Update
up crime

ఉద్యోగాల ఇప్పిస్తానని యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ అధికారిని బజారుకు ఇడ్చింది 22 ఏళ్ల ఓ మహిళా విద్యార్థిని. దీంతో  లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో 60 ఏళ్ల ప్రభుత్వ ఆర్డర్లీని సస్పెండ్ చేశారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోండా జిల్లాలోని  అదనపు సబ్-డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కార్యాలయంలో ఆర్డర్లీగా పనిచేస్తున్న హరివంశ్ శుక్లా (60), ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి బాధితురాలిని తన ప్రభుత్వ క్వార్టర్స్‌కు రప్పించాడు. 

తెలివిగా ఫోన్ లో రికార్డు

అయితే యువతి తెలివిగా ఫోన్ లో రికార్డు చేసింది.  క్వార్టర్స్‌కు వెళ్లిన ఆమెకు హరివంశ్ శుక్లా జాబ్ ఇప్పిస్తానని  మాయ మాటలు చెప్పి రూమ్ లోకి తీసుకువెళ్లాడు. లోపలికి వెళ్లాక అసభ్యంగా తాకుతూ ఆమెను లోచరుచుకునేందుకు ప్రయత్ని్ంచాడు.  దీంతో యువతి చాకచక్యంగా వీడియో రికార్డు చేసి అక్కడి నుంచి తప్పించుకుని అధికారలకు ఫిర్యాదు చేసింది.  దీంతో అతన్ని సస్పెండ్ చేశారు.  గతంలోనూ హరివంశ్ శుక్లా పలువురు యువతుల పట్ల కూడా ఇలాగే ప్రవర్తించిన్నట్లుగా  సమాచారం. 

ఇందుకు సంబంధించిన రెండు వీడియోలు ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిమిషం 36 సెకన్ల నిడివి గల ఒక క్లిప్‌లో శుక్లా అర్ధనగ్నంగా ఉన్నాడు.  ఆ యువతిని అనుచితంగా తాకడం,  ఆమె దుస్తులను  బలవంతంగా తొలగించడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది, ఆమె తనను తాను విడిపించుకోవడానికి కష్టపడుతున్నట్లుగా స్పష్టం అవుతోంది. 

పర్షద్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న యువతి ఒక నెల క్రితం కలెక్టరేట్‌లో ఉద్యోగ దరఖాస్తు చేసుకున్నప్పుడు తాను శుక్లాను మొదటిసారి కలిశానని వెల్లడించింది. గత 4-5 రోజులుగా నిందితుడు తనని లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె పేర్కొంది. ఉద్యోగం ఇప్పి్ంచేందుకు సహాయం చేస్తానని తనను క్వార్టర్స్‌కు పిలిచి కత్తితో బెదిరించి, తనచ  బట్టలు విప్పమని బలవంతం చేయడానికి ప్రయత్నించాడని ఆరోపించింది. కాగా హర్దోయ్ జిల్లాకు చెందిన శుక్లా మరో ఐదు నెలల్లో పదవీ విరమణ చేయనున్నాడు. ఈ క్రమంలో అతనిపై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు