Bihar Assembly Elections :పీకే మద్దతుదారుడి హత్య.. నీతీశ్‌ పార్టీ అభ్యర్థి అరెస్టు

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో జన్‌సురాజ్‌ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ మద్దతుదారు దులార్‌చంద్‌ యాదవ్‌ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో జేడీయూ అభ్యర్థి అనంత్‌ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

New Update
FotoJet - 2025-11-02T090150.260

PK supporter murdered.. Nitish party candidate arrested

Bihar Assembly Elections : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో జన్‌సురాజ్‌ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ మద్దతుదారు దులార్‌చంద్‌ యాదవ్‌ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. దులార్‌చంద్‌ హత్య కేసులో సీఎం నీతీశ్‌కుమార్‌ పార్టీ (జేడీయూ) అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అనంత్‌ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జేడీయూ అభ్యర్థి అయిన అనంత్‌ సింగ్‌ పట్నా జిల్లాలోని మొకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దులార్‌ చంద్‌ హత్య నేపథ్యంలో పోలీసులు అనంత్‌ సింగ్‌ పై అనుమానంతో ఆయనపై నిఘా ఉంచి ఈ రోజు ఆదివారం తెల్లవారుజామున బార్హ్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. ఈ హత్యతో సంబంధం ఉందన్న అనుమానంతో అనంత్‌ సింగ్‌ అనుచరులు మణికాంత్‌ ఠాకూర్, రంజీత్‌ రామ్‌ అనే మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించేందుకు పట్నాకు తరలించినట్లు అధికారులు తెలిపారు. 

జన్‌సురాజ్‌ పార్టీ అభ్యర్థిగా పీయూష్‌ ప్రియదర్శి మొకామా నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండగా.. జేడీయూ, జన్‌ సురాజ్‌ పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అదే సమయంలో పీయూష్‌ మామ, పార్టీ కార్యకర్త దులార్‌ చంద్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. పోస్టుమార్టం ప్రకారం బుల్లెట్‌ తగిలినప్పటికీ.. షాక్‌ కారణంగానే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. హత్య నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ఆయన మద్దతుదారులు ఆర్జేడీ మొకామా అభ్యర్థి వీణా దేవీ కారుపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ మొత్తం వ్యవహారంపై  నివేదిక సమర్పించాలని డీజీపీని ఎన్నికల సంఘం ఆదేశించింది. అల్లర్ల నివారణలో విఫలమయ్యారన్న కారణంపై పట్నా రూరల్‌ ఎస్పీ విక్రమ్‌ సిహాగ్‌ను బదిలీ చేసింది. మరో ముగ్గురు అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది.

ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని డీజీపీని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ క్రమంలోనే పట్నా రూరల్‌ ఎస్పీ విక్రమ్‌ సిహాగ్‌ను తక్షణమే బదిలీ చేయాలని రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ను ఆదేశించింది. మొకామా నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి, బాఢ్‌ ఎస్డీవో చందన్‌ కుమార్‌, బాఢ్‌-1 ఎస్డీపీవో రాకేశ్‌ కుమార్‌, బాఢ్‌-2 ఎస్డీపీవో అభిషేక్‌ సింగ్‌ల స్థానాల్లో నూతన అధికారులను నియమించాలని ఆదేశించింది. అభిషేక్‌పై సస్పెన్షన్‌ వేటు కూడా వేసింది. ఎస్పీ మినహా మిగతా ముగ్గురిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది.

Also Read: ISRO: ఈ రోజే ఎల్ఎం3-ఎం5  రాకెట్ ప్రయోగం

Advertisment
తాజా కథనాలు