Pakistan Spy: పాక్ కు గూఢచర్యం..రాజస్థాన్ లో మరో వ్యక్తి అరెస్ట్

పహల్గాంధాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ మరింత అప్రమత్తం అయింది. పాకిస్తాన్ కు సమాచారాలు చేరవేస్తూ గూఢచర్యం వేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టింది. తాజాగా మరో వ్యక్తిని రాజస్థాన్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. 

New Update
Certificate forgery racket busted, six arrested in Saroornagar

Certificate forgery racket busted, six arrested in Saroornagar

రాజస్థాన్ లో డీగ్ ప్రాంతానికి చెందిన ఖాసిం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో ఈవ్యక్తి పాక్ లోని కొంతమందితో ఫోన్ లో మాట్లాడినట్లు గుర్తించారు. అంతేకాదు పాకిస్తాన్ లో కూడా ఖాసిం తిరిగివచ్చాడని చెబుతున్నారు. నిందితుడికి సంబంధించిన ఫోన్‌ను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపించి.. దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాక్‌కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటివరకు యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా సహా 10 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

రెండో వ్యక్తి..

అంతకు ముందు మే 2న కూడా పాకిస్తాన్ ISI తరపున గూఢచర్యం చేస్తున్న రాజస్థాన్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పఠాన్ ఖాన్‌ 12ఏళ్లుగా భారత భద్రతకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్‌కు తరలిస్తున్నాడని అధికారులు తెలిపారు. బిఎస్‌ఎఫ్ సిబ్బంది కాపలా ఉన్న ప్రదేశంలో భూమికూడా ఉన్నట్లు గుర్తించారు. రాజస్థాన్ పోలీసు నిఘా విభాగం జైసల్మేర్‌కు చెందిన పఠాన్ ను అరెస్టు చేసింది. 2013 నుంచి భారతదేశ సరిహద్దు భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు తరలిస్తున్నాడని అధికారులు తెలిపారు. 

today-latest-news-in-telugu | rajasthan | India Pakistan spy

Also Read: PM Modi: కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేస్తే ఏదీ అసాధ్యం కాదు..ప్రధాని మోదీ

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు