Pani Puri: పానీపూరితో ఏడాదికి రూ.40 లక్షలు.. జీఎస్టీ శాఖ నోటీసులు

తమిళనాడులోని ఓ పానీపూరి అమ్ముకునే వ్యక్తి ఏకంగా ఏడాదికి రూ.40 లక్షలు సంపాదిస్తున్నాడు. అతడు ట్యాక్స్ కట్టడం లేదని తాజాగా జీఎస్టీ విభాగం నోటీసులు పంపించింది. ప్రస్తుతం ఈ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Pani puri Vendor

Pani puri Vendor

ఒకప్పుడు ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవారే ఎక్కువగా సంపాదిస్తారనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వీధి వ్యాపారులు కూడా ఇప్పుడు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే తమిళనాడులోని ఓ పానీపూరి అమ్ముకునే వ్యక్తి ఏకంగా ఏడాదికి రూ.40 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇవి ఆన్‌లైన్‌ చెల్లింపులు మాత్రమే. ఇంకా నగదు రూపంలో వచ్చేవాటితో కలిపితే ఇంతకన్నా ఎక్కువగానే సంపాదన ఉంటుంది. అయితే అతడు టాక్స్ కట్టకపోవడంతో జీఎస్టీ డిపార్ట్‌మెంట్ పన్ను నోటీసులు పంపించింది.

Also Read: ఇండియాలోకి చైనా వైరస్ కేంద్ర ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన

  రేజర్ పే, ఫోన్‌ పేల ద్వారా అందిన డేటా ప్రకారం ఆ వ్యాపారి వస్తువులు/సేవల సరఫరా కోసం పరిమితికి మించి యూపీఐ చెల్లింపులు చేశారని జీఎస్టీ అధికారులు నోటీసులో తెలిపారు. 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు అతడు రూ. 40,11,019 అందుకున్నాడని పేర్కొన్నారు. జీఎస్టీ రూల్స్‌ ప్రకారం ఆ వ్యాపారి తన సంపాదనపై రిజిస్ట్రేషన్ చేసుకోలేదని చెప్పారు. 

Also Read: కట్టలు తెంచుకున్న 20ఏళ్ల నాటి వైరస్.. చైనా నుంచి జపాన్‌కు.. నెక్ట్స్‌ ఇండియాకు?

జీఎస్టీ చట్టం 2017, సెక్షన్ 22లోని సబ్‌సెక్షన్ (1) ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల టర్నోవర్ కలిగిన ప్రతీ సరఫరాదారుడు కచ్చితంగా జీఎస్టీ నమోదు చేసుకోవాలి. పరిమితి దాటిన తర్వాత కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారం చేయడం చట్టరిత్యా నేరం. ఇలాంటి నేరానికి పాల్పడ్డవారికి రూ.10 వేలు లేదా టర్నోవర్‌లో 10 శాతం వరకు ఫైన్ విధిస్తారు. అయితే పానీపూరి అమ్ముకునే వ్యక్తికి వచ్చిన జీఎస్టీ నోటీస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.  

Also Read: ఓరి దేవుడా.. రెండు బస్సుల మధ్య ఇరుక్కున్నా ఎలా బతికావ్‌ రా బాబు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు