Pakistan: పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలు...మరోసారి కాల్పులు

పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు దేశాలు సరిహద్దుల వద్ద తమ నిఘాను మరింత కట్టుదిట్టం చేశాయి. పాక్ మరోసారి భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్ భూభాగంపైకి పాక్ సైన్యం కాల్పులు జరిపింది.

New Update
 Pakistan vs India's Military

Pakistan vs India's Military

Pakistan: పహల్గాం ఉగ్ర దాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్‌(India), పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు దేశాలు సరిహద్దుల వద్ద తమ నిఘాను మరింత కట్టుదిట్టం చేశాయి. మరోవైపు పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పడం కోసం ఆ దేశంపై భారత్‌ అనేక ఆంక్షలు విధించింది. అయినా తన వైఖరిని మార్చుకోవడం లేదు. తాజాగా గురువారం మరోసారి భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి వరుసగా ఎనిమిదో రోజు గురువారం రాత్రి సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారత్ భూభాగంపైకి పాక్ సైన్యం కాల్పులు జరిపింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషారా, అక్నూరు సెక్టర్లలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. పాక్ సైన్యం ఎప్పుడు కాల్పులు జరిపినా.. అందుకు ధీటుగా భారత సైన్యం వెంటనే స్పందించి తగిన రీతిలో జవాబు ఇస్తోంది. ఈ కవ్వింపు చర్యలపై భారత్ అధికారులు ఇప్పటికే పాక్‌ అధికారులతో హాట్ లైన్‌లో మాట్లాడారు. అయినా పాక్ మాత్రం తన వైఖరిని ఏ మాత్రం మార్చుకోవడం లేదు. దీనికి తోడు ఆ దేశ నాయకులు కూడా రెచ్చ గొట్టే వ్యాఖ్యలు మానుకోవడం లేదు.

Also Read:BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

పర్యాటకులే లక్ష్యంగా..

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ ఘటన వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనేందుకు స్పష్టమైన సాక్ష్యాలను భారత్ సంపాదించింది. దీంతో పాకిస్థాన్‌పై భారత్ పలు ఆంక్షలు విధించింది. ఈ విషయంలో ప్రపంచ దేశాల మద్ధతు కూడగట్టేందుకు కూడా భారత్‌ ప్రయత్నం చేస్తోంది. అన్ని రకాలుగా ఒంటరైన పాక్‌ మాత్రం మేకపోతు గాంభీర్యా్న్ని ప్రదర్శిస్తోంది. తమ వద్ద అణ్వాయుధాలున్నాయని ప్రగల్భాలు పలుగుతోంది.దాంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ ఉగ్రదాడి జరిగిన కొద్దిరోజులకే నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోని సైనికుల పోస్టులే లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ కాల్పులు జరుపుతోంది.

Also Read:'స్పిరిట్' మొదలయ్యేది అప్పుడే..! సాలిడ్ అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్


అయితే ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని భారత సైన్యం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విధితమే. మరోవైపు లష్కరే తోయిబా చీఫ్ హాఫీజ్ సయిద్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేసింది. పహల్గాం ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంన్స్ ఫ్రంట్ ఉన్నట్లు ఇప్పటికే ఆ సంస్థ ప్రకటించింది. దీంతో ఈ ఉగ్రదాడిలో హాఫీజ్ సయిద్ పాత్ర కీలకమని భారత్ గాఢంగా విశ్వసిస్తోందని పాక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అతడికి భద్రతను కట్టుదిట్టం చేసింది. పాక్‌లో వరుసగా ఉగ్రవాదులు హత్యలకు గురవుతుండటంతో హాఫీజ్‌ కు భారీ భద్రత పెంచారు.  అంతేకాక పాక్‌ సరిహద్దుల వద్ద సైన్యం కవాతు నిర్వహిస్తోంది. తన పౌరులకు యుద్ధం తప్పదనే సంకేతాలు ఇస్తూనే వారిని అప్రమత్తం చేస్తోంది.

Also Read:Life Style: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!

Advertisment
తాజా కథనాలు