Flight: రాంగ్ ఫ్లైట్ ఎక్కి వేరే దేశంలో దిగాడు.. చివరికి

పాకిస్థాన్‌లోని షాజహాన్ అనే వ్యక్తి లాహోర్ నుంచి కరాచీకి బయలుదేరాడు. స్థానిక ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళానికి గురై వేరే విమానంలో ఎక్కడంతో సౌదీలో ల్యాండ్ అయ్యాడు. చివరికి అక్కడికి ఇమ్మిగ్రేషన్ అధికారులు మళ్లీ లాహోర్‌కు పంపించారు.

New Update
Flight

Flight

సాధారంగా కొందరు బస్సులు, ట్రైన్లు ఎక్కేటప్పుడు గందరగోళానికి గురై వేరే దాంట్లో ఎక్కేస్తుంటారు. దీంతో వాళ్లు దిగాల్సిన చోటు కాకుండా వేరే ప్రాంతాలకు చేరుకుంటారు. ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. అయితే తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఏకంగా రాంగ్‌ ఫ్లైట్‌నే ఎక్కేశాడు. చివరికి వేరే దేశంలో ల్యాండ్ అయ్యాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. పాకిస్థాన్‌లోని షాజహాన్ అనే వ్యక్తి లాహోర్ నుంచి కరాచీకి బయలుదేరాడు. ఇందుకోసం అతడు లోకల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. 

దేశీయ విమానాలు ఆగే డొమెస్టిక్ టర్నినల్‌ లోపలికి వెళ్లాడు. ఆ తర్వాత అతడు అక్కడున్న ఓ విమానం కరాచీ వెళ్తుందని భావించి అందులో ఎక్కాడు. లోపలికి వెళ్లేటప్పుడు టికెట్ చూపించగా సిబ్బంది కూడా పర్మిషన్ ఇచ్చారు. విమానం బయలుదేరింది. కానీ ఎంతసేపైన కరాచీలో అది ల్యాండ్ కాకపోవడంతో అతడికి అనుమానం వచ్చింది. సిబ్బందిని అడగగా అసలు విషయం తెలుసుకొని కంగుతిన్నాడు. 

Also Read: విదేశాల నుంచి భారీగా నిధులు..అక్రమంగా మతమార్పిడులు..చంగూర్‌బాబా కేసులో సంచలన విషయాలు

తనను కరాచీకి చేర్పించాలని అడిగితే.. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం మూడు రోజుల సమయం పడుతుందని సిబ్బంది చెప్పారు. అంతేకాదు అతడు ఎక్కిన ఆ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ కూడా కరాచీకి మరో టికెట్ కొనుగోలు చేస్తేనే తీసుకెళ్తామని చెప్పింది. అతడికి పాస్‌పోర్ట్‌ కూడా లేకపోవడంతో జెడ్డాలో దిగాక.. అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. చివరికి అతడి పరిస్థితిని అర్థం చేసుకొని లాహోర్‌కు తిరిగి పంపించారు. 

ఈ విషయం పాక్‌ పౌర విమానయాన శాఖ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌ సంస్థపై అధికారులు భారీగా ఫైన్ విధించారు. అయితే లాహోర్ ఎయిర్‌పోర్టులో ఇంటర్నేషనల్ టర్మినెల్‌కు మరమ్మతులు చేస్తున్నారు. అక్కడి విమానాలను డొమెస్టిక్ టర్మినల్ వద్దే ఉంచడం వల్ల గందరగోళం ఏర్పడింది. అందుకే అతడు వెళ్లాల్సిన ఫ్లైట్ కాకుండా మరో ఫ్లైట్ ఎక్కాడు.  

Also Read: బిహార్‌ ఎన్నికలకు ముందు బిగ్ ట్విస్ట్.. ఓటర్ల జాబితాలో బంగ్లాదేశ్, నేపాల్‌ పౌరులు

Advertisment
Advertisment
తాజా కథనాలు