/rtv/media/media_files/2025/02/24/ESm6vipmYNwZnFXT55kN.webp)
Champions Trophy
Champions Trophy : సోమవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన న్యూజిలాండ్.. భారత్‌తో పాటు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. దాంతో ఆతిథ్య పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు అధికారికంగా టోర్నీ నుండి నిష్క్రమించాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఏ సెమీ-ఫైనలిస్టులు ఎవరో తేలిపోయింది.
Also Read: భారత్‌లో ప్రతీ ఐదుగురిలో ముగ్గురు క్యాన్సర్‌తో మృతి.. సర్వేలో సంచలన విషయాలు
సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కివీస్ ఆటగాళ్లు ఔరా అనిపించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ అదరగొట్టారు. బౌలింగ్‌లో మైఖేల్ బ్రేస్‌వెల్ 4 వికెట్లు పడగొట్టి బంగ్లాను దెబ్బకొట్టగా.. ఛేదనలో యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీ బాదాడు. 105 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 112 పరుగులు చేశాడు. ఈ ఓటమితో బంగ్లాదేశ్ పోతూ పోతూ పాకిస్తాన్‌ను వెంటబెట్టకెళ్లింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో బంగ్లా గెలిచుంటే.. అప్పుడు మూడు జట్లకు సెమీస్ అవకాశాలు ఉండేవి.గ్రూప్ - ఏలో ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 27న పాక్- బంగ్లాదేశ్ జట్లు తలపడనుండగా.. మార్చి 02న భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: పులివెందుల ప్రజలకు జగన్ గుడ్ న్యూస్.. ఎల్లుండే ప్రారంభోత్సవం!
సుమారు 30 ఏళ్ల విరామం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్రోఫీలో పాకిస్థాన్ లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలోకి దిగిన పాకిస్థాన్.. నాకౌట్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. టైటిల్ మాట పక్కనబెడితే.. కనీసం సెమీఫైనల్ కూడా చేరలేకపోయింది. ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయి.. చేజేతులా సెమీస్ అవకాశాలను పోగొట్టుకుంది. సోమవారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించడంతో పాకిస్థాన్.. నిష్క్రమణ ఖరారైంది.
Also Read: 2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులను పీకి పారేసిన ట్రంప్!
సోమవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లలో రచిన్ రవీంద్ర సెంచరీ చేశాడు. దీంతో న్యూజిలాండ్ ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది.
Also Read : పాకిస్థాన్లో హై అలెర్ట్ : ఛాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. రంగంలోకి ఉగ్రవాదులు!
ఈ ఫలితంతో గ్రూప్-ఏ నుంచి టాప్-2 జట్లేవో ఖరారయ్యాయి. అయితే ఎవరు తొలిస్థానం, ఎవరు రెండోస్థానంలో ఉంటారనేది తేలాల్సి ఉంది. మార్చి 2న జరిగే భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టేబుల్ టాపర్‌గా నిలిచి.. లీగ్ దశను ముగిస్తుంది.