పులివెందుల ప్రజలకు జగన్ గుడ్ న్యూస్.. ఎల్లుండే ప్రారంభోత్సవం!

రేపు, ఎల్లుండి పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ నెల 26న వైయస్‌ఆర్‌ ఫౌండేషన్‌, ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్ట్సిట్యూట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజారెడ్డి ఐ సెంటర్‌ను జగన్ ప్రారంభించనున్నారు.

New Update
YS Jagan Pulivendula Tour

YS Jagan Pulivendula Tour

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు, ఎల్లుండి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి.. 11.45 గంటలకు పులివెందుల చేరుకుంటారు. స్ధానిక నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ప్రజాదర్భార్ నిర్వహించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఎల్లుండి అంటే ఈ నెల 26న ఉదయం 10 గంటలకు పులివెందుల గుంత బజార్‌ రోడ్డులో వైయస్‌ఆర్‌ ఫౌండేషన్‌, ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్ట్సిట్యూట్‌ సంయుక్తంగా ఆధునీకరించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వైయస్‌ రాజారెడ్డి ఐ సెంటర్‌ను జగన్ ప్రారంభించనున్నారు.
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు