President Droupadi Murmu: ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద పోరుపై చారిత్రక ఉదాహరణ..రాష్ట్రపతి స్వాతంత్ర దినోత్సవ సందేశం

స్వాతంత్ర దినోత్సవాన్ని సురస్కరించుకుని దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశాన్నిచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద పోరుపై ఓ చారిత్రాత్మక ఉదాహరణగా గుర్తుండిపోతుందని అన్నారు. 

New Update
President Droupadi Murmu

President Droupadi Murmu

ఏప్రిల్‌లో పహల్గామ్‌లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రవాద దాడిని పిరికిపంద మరియు పూర్తిగా అమానుషమైనదిగా రాష్ట్రపతి అభివర్ణించారు రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద పోరుపై భారత్ తీసుకున్న నిర్ణయాత్మక, అచంచలమైన సంకల్పంగా అభివర్ణించారు. ఇది మన సాయుధ దళాలు ఎట్టి పరిస్థితుల్లోనూ దేశాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాయని నిరూపించిందని కొనియాడారు. ఉగ్రవాదంపై సలిపిన ఈ పోరు భారత చరిత్రలో నిలిచిపోతుందని..పహల్గామ్ దాడి తర్వాత దేశం దేశం ఐక్యంగా స్పందించడమే మనల్ని విభజించాలనుకునే వారికి అత్యంత సరైన ప్రతిస్పందన అని రాష్ట్రపతి ముర్ము అన్నారు. 

భారతదేశం తమ పౌరులను రక్షించుకోవడంలో ఎప్పుడూ ముందుంటుందని రాష్ట్రపతి అన్నారు. తమ దేశం దూకుడుగా నిర్ణయాలు తీసుకోదని భావించేవారికి ఆపరేషన్ సింధూర్ ఒక చెప్పు దెబ్బ అని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌ను రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ మిషన్‌కు ఒక పరీక్షా కేసుగా అభివర్ణించారు ద్రౌపదీ ముర్ము. దీని ఫలితం మనం సరైన దిశలో పయనిస్తున్నామని రుజువు చేస్తోందని చెప్పారు. 

యువతకు వేగంగా ఉపాధి అవకాశాలు..

దేశం యువతకు ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. జాతీయ విద్యా విధానం 2020.. విద్యను విలువలతో, నైపుణ్యాలను సంప్రదాయంతో మిళితం చేసే సుదూర మార్పులను తీసుకువచ్చిందని చెప్పారు.  దేశంలో వ్యవస్థాపకత కలలు కనేవారికి ప్రభుత్వం అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించదని కొనియాడారు. దేశ అంతరిక్ష కార్యక్రమం విస్తరణ గురించి ఆయన ప్రస్తావిస్తూ, "శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించడం ఒక తరమంతా పెద్ద కలలు కనేలా ప్రేరణనిచ్చిందన్నారు. రాబోయే మాన సహిత అంతరిక్ష మిషన్ గగన్ యాన్ కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Advertisment
తాజా కథనాలు