Illeagal Immigrants: 1000 మంది అక్రమ వలసదారులు గుర్తింపు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

గుజరాత్‌లో 1000 మందికి పైగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులను పోలీసులు గుర్తించారు. వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా ఫేక్ సర్టిఫికేట్లతో గుజరాత్‌లోనికి ప్రవేశించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి తెలిపారు. త్వరలోనే వీళ్లను దేశం నుంచి పంపిస్తామన్నారు.

New Update
Over 1,000 illegal Bangladeshi immigrants detained in crackdown at Ahmedabad, Surat

Over 1,000 illegal Bangladeshi immigrants detained in crackdown at Ahmedabad, Surat

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా దేశంలో అక్రమంగా ఉంటున్నవాళ్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే గుజరాత్‌లో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో 1000 మందికి పైగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులను పోలీసులు గుర్తించారు. వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా ఫేక్ సర్టిఫికేట్లతో గుజరాత్‌లోనికి ప్రవేశించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తెలిపారు.  

Also Read: పాక్ జెండాలతో నిరసన .. ఆరుగురు బజరంగ్ దళ్ కార్యకర్తలు అరెస్ట్!

ఇక వివరాల్లోకి వెళ్తే.. శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి గుజరాత్‌లో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో అహ్మాదాబాద్‌లో 890 మందిని, సూరత్‌లో 134 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లందరూ కూడా పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దులు దాటి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు హోంమంత్రి తెలిపారు. ఫోర్జరీ పత్రాలతో వీళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు చెప్పారు. 

Also Read: అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

'' పట్టుబడ్డవాళ్లలో చాలామంది మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో అనుమానితులుగా ఉన్నారు. ఇటీవల నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేశాం. వాళ్లలో ఇద్దరు అల్‌ఖైదా స్లీపర్ సెల్స్‌తో పనిచేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించాం. అందుకే తాజాగా గుజరాత్‌లో భారీ ఆపరేషన్ చేపట్టాం. వీళ్ల డ్యాకుమెంట్లు పరిశీలంచిన తర్వాత త్వరలోనే దేశం నుంచి పంపించివేస్తామని'' హోంమంత్రి హర్ష్‌ సంఘవి తెలిపారు.

అంతేకాదు తమ రాష్ట్రంలో పాకిస్థానీయులు ఎవరైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూల్స్‌ ప్రకారం వాళ్లు కూడా గుజరాత్‌ నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. చట్ట వ్యతిరేకంగా దేశంలో ఉండేవాళ్లపై న్యాయపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే అక్రమ వలసదారులు వెంటనే లొంగిపోవాలని సూచనలు చేశారు.   

Also Read: పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

rtv-news | Pahalgam attack | national-news | telugu-news 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు