/rtv/media/media_files/2025/04/26/43Cdum4mkKLjCrM7QYF8.jpg)
pak karntaka
కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఇటీవల ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు శుక్రవారం కర్ణాటకలోని జగత్ సర్కిల్, అలంద్ నాకా, మార్కెట్ చౌక్, సాత్ గుంబజ్ సహా అనేక చోట్ల రోడ్లపై పాకిస్తాన్ జెండాలను అతికించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పాకిస్థాన్ జెండాలను రోడ్ల మీద, టాయిలెట్ వాల్స్ కు కూడా అంటించారు. అయితే ఓ కూడలిలో పాక్ జెండాలను రోడ్డుపై అంటించడాన్ని ముస్లిం మహిళలు తీవ్రంగా ఖండిస్తూ పాక్ జెండాలను తీసి వారితో తీసుకెళ్లారు.
అయితే ఈ నిరసనలకు అనుమతి తీసుకోలేదనే కారణంతో పోలీసులు ఆరుగురు బజరంగ్ దళ్ సభ్యులను అదుపులోకి తీసుకుని తరువాత విడుదల చేశారు. "పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్డుపై పాకిస్తాన్ జెండాలను అతికించి నిరసన తెలిపారు. కానీ, వారు ఎవరి అనుమతి తీసుకోలేదు. ఇది గందరగోళాన్ని సృష్టించింది. ఆరుగురిని ముందస్తు అరెస్టు చేసి, తరువాత విడుదల చేశాం" అని పోలీస్ కమిషనర్ శరణప్ప అన్నారు. నిరసనలు నిర్వహించేవారు ఎలాంటి గందరగోళం ఏర్పడకుండా ముందస్తు అనుమతి తీసుకోవాలని శరణప్ప చెప్పారు.
Also Read : నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 100 మందికి పైగా?
కర్ణాటకలో, పహల్గామ్ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా హిందువులపై జరిగిన నిరసన సందర్భంగా ప్రధాన రహదారిపై పాకిస్తాన్ జెండాలను అతికించారు.
— 🪷🪷🚩హైందవి రెడ్డి 🚩🪷🪷BJP Parivar (@HyndaviPandem) April 25, 2025
ఇద్దరు ముస్లిం మహిళలు ఆ పాకిస్తాన్ జెండాలను తొలగిస్తున్న దృశ్యాలు6..
కేరళ , బెంగాల్ , next కర్ణాటక ...హైదరాబాద్ pic.twitter.com/3JGlu0w7Oo
Also Read : 1000 మంది అక్రమ వలసదారులు గుర్తింపు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే పాక్‌తో యుద్ధానికి తాము అనుకూలంగా లేమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి ఉండటంతో పాటు ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలని, కేంద్రం భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం భద్రతా వైఫల్యమే కారణమని సిద్ధారామయ్య ఆరోపించారు. కాశ్మీర్‌లో కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేయాలని తెలిపారు.
పహల్గామ్‌లో పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. అలాంటిది ఇక్కడ సరైన భద్రతా ఏర్పాట్లు చేసి ఉండాలని తెలిపారు. ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం.. ఇంటెలిజెన్స్ వైఫల్యం, భద్రతా వైఫల్యమే కారణమన్నారు. ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారు. కానీ ఆ నమ్మకాన్ని ప్రభుత్వం కాపాడుకోలేకపోయింది. ఇప్పుడు ఏం చేసినా కూడా చనిపోయిన వారి ప్రాణాలు తిరిగి రావన్నారు. అయితే సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ప్రభుత్వానికి సపోర్ట్‌గా ఉండకుండా.. యుద్ధానికి సిద్ధంగా లేమని చెప్పడం ఏంటని అంటున్నారు.
Also Read : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
Also Read : ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!
karnataka | bajrang-dal | pahalgam terror attack | Pahalgam Terror Attack News | Hindu activists