IRAN: హిజాబ్ ధరించకపోతే ఉరిశిక్ష–ఇరాన్ లో కొత్త చట్టం

ఇరాన్ లో మహిళల బతుకు మరింత నరకం అవనుంది. అక్కడి కొత్త చట్టాలు వారి హక్కులను మరింత దిగజార్చనున్నాయి. ఇరాన్‌లో మహిళలు హిజాబ్ ధరించకపోతే మరణశిక్షే అంటూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది అక్కడి ప్రభుత్వం. 

New Update
1

మహిళలు హిజాబ్‌ వంటి నైతిక చట్టాలను కఠినంగా పాటించేందుకు ఇరాన్ ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువచ్చింది. దీని పరకారం ఇరాన్‌లో మహిళలు కచ్చితంగా హిజాబ్‌ను ధరించాలి. అలా చేయవారికి కఠిన శిక్షలుంటాయి. చట్టాన్ని ధిక్కరించిన వారు మరణశిక్ష లేదా 15 ఏళ్ల వరకు జైలుశిక్షతో సహా కఠినమైన శిక్షల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. “పవిత్రత , హిజాబ్ సంస్కృతి”ని ప్రోత్సహించేందుకు ఈ చట్టాలను ఇరాన్ అధికారులు ఈ నెల ప్రారంభంలో ఆమోదించారు. ఈ చట్టాలు నగ్నత్వం, అసభ్యతను వ్యతిరేకిస్తూ పూర్తిగా దుస్తులు ధరించడాన్ని ప్రోత్సహిస్తుంది అని చెబుతున్నారు. నేరాన్ని బట్టి శిక్షలుంటాయిన చెబుతున్నారు ఇరాన్ ప్రభుత్వ అధికారులు. భారీ నగదు జరిమానాలు, కొరడా దెబ్బలు, మరోసారి ఇలాంటి నేరాలకు పాల్పడితే 5 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. 

ది గార్డియన్ ప్రకారం..సరిగ్గా డ్రెస్ చేసుకోకపోవడం...లాంటి వీడియోలు, ఫోటోలు అంతర్జాతీయ మీడియకు పంపించడం వంటివి కూడా నేరమే. ఇలాంటి వాటికి  12,500 పౌండ్లు( రూ. 13.5 లక్షల) జరిమానా, కొరడా దెబ్బలు ఉంటాయి. ఒకవేళ మళ్ళీ మళ్ళీ వీటిని పునరావృతం చేస్తే.. 5 నుంచి 15 ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కోవాలి. హిజాబ్ ఆదేశాలను పాటించపోవడం, నైతికత చట్టాలను ధిక్కరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇరాన్ సిద్ధమైంది. ఇరాన్ యొక్క ఇస్లామిక్ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 296 ప్రకారం, “భూమిపై అవినీతి”గా పరిగణించబడే వ్యక్తులకు మరణశిక్ష విధించబడుతుంది.

ఇరాన్‌లో రానురాను ప్రజా జీవనం కష్టమైపోతోంది. కఠినమైన శిక్షలకు భయపడి జనాలు భయపడిపోతున్నారు. రెండేళ్ల క్రితం మహ్సా అమిని అనే 22 ఏళ్ల కుర్దిష్ మహిళ హిజాబ్ సరిగా ధరించలేదని మోరాలిటీ పోలీసులు దాడి చేయడంతో ఆమె మరణించింది. ఈ మరణం తర్వాత ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది. అయితే, అక్కడి అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేసింది. ఇందులో పాల్గొన్న కొందరికి మరణశిక్షలు అమలు చేసింది. ఇప్పుడు ఏకంగా కొత్త చట్టాన్నే తీసకువచ్చింది. 

Also Read: Pushpa-2: ఆరు రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్‌లో పుష్ప–2..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు