జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు

వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను అమల్లోకి తీసుకొస్తామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. పార్లమెంటులో అందరీ అభిప్రాయం లేకుండా దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని పేర్కొన్నారు.

mallikharjuna 2
New Update

దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్ కూడా జమిలి ఎన్నికల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ కూడా దేశంలో అన్ని ఎన్నికలను ఒకేరోజు నిర్వహించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని.. దీన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. అయితే ప్రధాని వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. పార్లమెంటులో ఏకాభిప్రాయం లేకుండా దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని అన్నారు. 

Also Read: సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని మోదీ..

అది సాధ్యం కాదు

'' ప్రధాని మోదీ ఏం చెప్పారో అది చేయలేరు. ఎందుకంటే జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు అందరి అభిప్రాయలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అలా చేస్తేనే ఇది ముందుకు కదులుతుంది. కానీ ఇలా సాధ్యపడదు. అసలు జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యంమని'' మల్లీఖార్జున ఖర్గే తేల్చి చెప్పారు. ఈ వ్యవహారం అనేక రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలతో పాటు అనేక సమస్యలతో ముడిపడి ఉందని తెలిపారు.  

గతంలో రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని.. ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ హామీలిచ్చి వాటిని నెరవేర్చలేకపోయారని మల్లిఖార్జున ఖర్గే విమర్శలు చేశారు. మోదీ తాను చేయాల్సిన పనులనే చేయట్లేదని.. ప్రజలను మోసం చేసేందుకు మాత్రమో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. 

Also Read: మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ స్కీమ్ రద్దు?

ఇదిలాఉండగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కేవడియాలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విపక్షాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్, ఉమ్మడి పౌరస్మృతి త్వరలోనే అమల్లోకి రానున్నాయని ప్రధాని మోదీ అన్నారు. వీటిని ఎవరూ కూడా అడ్డుకోలేరని పేర్కొన్నారు. 

#telugu-news #pm-modi #national-news #mallikharjuna-kharge
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe