సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని మోదీ..

గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం(BSF), ఆర్మీ, నేవి, వాయుసేన సిబ్బందితో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు. సైనికులకు మిఠాయిలు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

New Update
MODI

దీపావళి వచ్చిందంటే ప్రధాని మోదీ సరిహద్దుల్లో ఉండి దేశాన్ని రక్షించే జవాన్లతోనే దీపావళి పండుగ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆయన సైనికులతో కలిసే వేడుకలు జరుపుకున్నారు. గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం(BSF), ఆర్మీ, నేవి, వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. కచ్‌లోని సర్‌ క్రీక్‌ ప్రాంతంలో లక్కీ నాలకు ప్రధాని బోటులో వెళ్లారు. ఎప్పట్లాగే సైనిక దుస్తుల్లోనే అక్కడికి చేరుకున్నారు. 

Also Read: మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ స్కీమ్ రద్దు?

భద్రతా సిబ్బందికి మిఠాయిలు తినిపించి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో విధులు నిర్వహించడం చాలా కష్టతరమైంది. ఇక్కడ పగటి సమయంలో అత్యంత వేడి ఉంటుంది. అలాగే రాత్రికి కూడా చలి ఎక్కువగా ఉంటుంది. ప్రధాని ఇక్కడికి రాకముందు సర్దార్ వల్లభాయ్ జయంతి సందర్భంగా కేవడియాలోని ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. అక్కడ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. స్థానికులతో కలిసి ఐక్యతా ప్రమాణం చేశారు. ఆ తర్వాత జాతీయ ఐక్యతా దివస్ పరేడ్‌లో పాల్గొన్నారు. సైనిక సిబ్బంది చేసిన విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలను వీక్షించారు. 

Also Read: ఖలిస్థానీ దాడుల వెనుక అమిత్‌ షా హస్తం?.. సంచలనం రేపుతున్న ఆరోపణలు

ఇదిలాఉండగా 2014లో ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ ప్రతీ ఏడాది సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. సైనిక దళాలలతో ముచ్చటిస్తూ వారికి స్వీట్లు తినిపించి వాళ్ల సేవలను కొనియాడుతూ మరితం స్పూర్తిని నింపుతున్నారు. 2014లో తొలిసారిగా సియాచిన్‌లో సైనికులతో కిలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గత ఏడాది హిమాచల్‌ప్రదేశ్‌లోని చైనా సరిహద్దులో ఉన్న లేప్చా సైనిక శిబిరంలో వేడుకలు జరుపుకున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు