/rtv/media/media_files/2025/03/04/oaIN5bpGp23fJncGw97X.jpg)
Odisha Man Kills Father For Rs 10, Surrenders To Police With Severed Head
ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి రూ.10 కోసం సొంత తండ్రినే నరికి చంపేశాడు. ఆ తర్వాత తండ్రి తల తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అయ్యాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని భైదార్ సింగ్(70) అనే వ్యక్తి తన కుటుంబంతో ఉంటున్నాడు. అయితే అతడి కొడుకు (40) గుట్కా కొనుక్కోనేందుకు రూ.10 డబ్బులు అడిగాడు. కానీ భైదార్ సింగ్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు.
Also Read: అసెంబ్లీలో గుట్కా నమిలి ఉమ్మిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్
దీంతో అతడి కొడుకు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పదునైన ఆయుధంతో తన తండ్రిని హత్య చేశాడు. దీంతో భయంతో అతడి తల్లి అక్కడి నుంచి పారిపోయింది. ఆ తర్వాత నిందితుడు తన తండ్రి తలను తీసుకొని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. డబ్బుల విషయంలో తండ్రి, కొడుకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఈ దారుణం జరిగినట్లు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి ఫోరెన్సిక్ బృందం వెళ్లిందని.. ఈ కేసుపై విచారణ సాగుతోందని పేర్కొన్నారు.
Also Read: ఎయిర్ పోర్టులో అడ్డంగా దొరికిన హీరోయిన్..ఆ పనిచేస్తూ పోలీసులకు..