RTVతో అఘోరి.. నా విశ్వ రూపం చూపిస్తా.. వాడి మర్మాంగాలు కొస్తా!

లేడీ అఘోరీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆర్టీవీతో మాట్లాడింది. సనాతన ధర్మం జోలికి వస్తే తాను సహించను అని తెలిపింది. రెండు రోజుల్లో తెలంగాణలో శివ తాండవం జరగబోతుందని.. ఆడపిల్ల మీద చేయి వేసినవాడి మర్మాంగాలు కోసేస్తా అని అఘోరీ చెప్పుకొచ్చింది. 

New Update
Lady Aghori (3),

గత నెల రోజుల నుంచి లేడీ అఘోరీ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తానంటూ పలు ఆలయాలను సందర్శిస్తోంది. తెలంగాణ నుంచి ఇటీవల ఏపీకి మకాం మార్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పలు ఆలయాలను సందర్శిస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా విజయవాడలోని కనక దుర్గమ్మను అఘోరి దర్శంచుకుంది. 

ఇది కూడా చదవండిః Dwacra: డ్వాక్రా మహిళలకు తీపి కబురు.. ఆ పథకం కింద రూ.10 లక్షలు!

తెలంగాణలో శివ తాండవం

అనంతరం తాజాగా ఆర్టీవీతో ఆమె మాట్లాడింది. సనాతన ధర్మం జోలికి వస్తే తాను సహించను అని తెలిపింది. ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగితే అక్కడ తానుంటా అని పేర్కొంది. అంతేకాకుండా తెలంగాణలో తనను అపే మగాడు ఇంకా పుట్టలేదని మాట్లాడింది. రెండు రోజుల్లో తెలంగాణలో శివ తాండవం జరగబోతుందని.. ఆడపిల్ల మీద చేయి వేసినవాడి మర్మాంగాలు కోసేస్తా అని అఘోరీ చెప్పుకొచ్చింది. 

ఇది కూడా చదవండిః ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌‌‌‌గా ఆయనే..!

తెలంగాణలో ఆలయాలను ధ్వంసం అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని మండిపడింది. మరోవైపు  పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారని.. అయితే ఆయన నుంచి తనకు ఎటువంటి సందేశం ఇంకా అందలేదని అఘోరీ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఇది కూడా చదవండిః కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు

ఇదిలా మరోవైపు ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. బెల్లంపల్లిలో నిర్వహించే లక్ష దీపాల మహోత్సవానికి తరలి రండి అని ఆ వీడియోలో పేర్కొంది. సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉందని తెలిపింది. స్త్రీలపై దాడులను ఆపే శక్తి మన దగ్గర ఉందని చెప్పుకొచ్చింది. గోహత్యలను నివారించేందుకు పోరాడుదాం అని పేర్కొంది.

ఇది కూడా చదవండిః దొంగలతో కానిస్టేబుల్ దోస్తీ.. చివరికి వారిచేతిలోనే హతం, కారణం ఇదే!

ఇవాళ కాకినాడ జిల్లా సామర్లకోటలో అఘోరి తెల్లవారుజామున 4.గంటలకు ప్రత్యక్షమైంది. మహిళా పోలీస్ ల భద్రత మధ్య.. పంచారామ క్షేత్రంలో ఒక్కటైనా శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించింది. ఆలయంలోకి ఎరుపు వస్త్రం ధరించి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించింది. అక్కడ నుండి రాజమండ్రి వైపు వెళ్లిపోయింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు