Supreme Court : రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేరు: సుప్రీంకోర్టు కీలక కామెంట్స్

రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదం విషయంలో కోర్టులు గడువు నిర్దేశించలేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ బిల్లులను ఆమోదించడంలో దీర్ఘకాలిక జాప్యం జరిగితే మాత్రం న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

New Update
Supreme Court

Supreme Court

Supreme Court : రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదం విషయంలో కోర్టులు గడువు నిర్దేశించలేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ బిల్లులను ఆమోదించడంలో దీర్ఘకాలిక జాప్యం జరిగితే మాత్రం న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతి రిఫరెన్స్ కేసులో తమ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు వెల్లడించింది.

Also Read: ఢిల్లీ బాస్ట్ కేసులో కొత్త మలుపు.. ఉమర్ తో సంబంధం ఉన్న మరో ఇద్దరి అరెస్ట్

 రాజ్యాంగంలోని అధికరణం 200ప్రకారం, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్య తీసుకోవడానికి న్యాయస్థానం నేరుగా ఖచ్చితమైన గడువును నిర్ణయించలేదంది.  గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా నిర్దిష్ట సమయం దాటిపోతే, ఆ బిల్లులకు ఆమోదం లభించినట్లుగా భావించాలనే భావన రాజ్యాంగానికి విరుద్ధమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

గవర్నర్ రబ్బరు స్టాంప్ కాదు

గవర్నర్ రబ్బరు స్టాంప్ కాదు, కానీ రాష్ట్రాల శాసనపరమైన నిర్ణయాలను నిరవధికంగా నిలిపివేసి, ప్రజాస్వామ్య ఆకాంక్షను అడ్డుకోలేరు. గవర్నర్‌లు సహేతుకమైన కాలపరిమితి లోపల చర్య తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

Also Read: ఖమ్మం గట్టయ్య సెంటర్‌లో దారుణం.. ఉదయాన్నే భార్య గొంతు కోసి.. పిల్లలను నరికి..!

Advertisment
తాజా కథనాలు