/rtv/media/media_files/2025/08/27/no-helmet-no-fuel-2025-08-27-21-42-33.jpg)
No Helmet No Fuel
No Helmet No Fuel : రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టిన కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా వాహనాలు నడిపేప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్పిన పెడచెవిన పెడుతున్నారు. దీంతో పలువురు ప్రమాదాల భారీన పడుతున్నారు. అయితే ఈ విధానానికి చెక్ పెట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చించి ఈ క్రమంలో సెప్టెంబర్ 1 నుంచి నో హెల్మెట్ – నో ఫ్యూయల్ అనే కొత్త నియమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
నిజానికి ఈ కొత్త రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ ను ఎప్పటినుంచో అమలు చేస్తామని చెబుతోన్న ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఈ సెప్టెంబర్ నుంచి అమలు చేయడానికి సిద్ధమైంది. అయితే నో హెల్మెట్, నో ఫ్యూయల్ విధానాన్ని సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు తొలుత అమలు చేస్తారు. అంటే మనం ఎవరైనా హెల్మెట్ లేకుండా టూ వీలర్ మీద పెట్రోల్ బంక్‌కి వెళ్తే మీకు పెట్రోల్ పోయరన్నమాట. టూ వీలర్ రైడర్స్‌తో పాటు వెనుక కూర్చునే పిలియన్ రైడర్స్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ క్యాంపెయిన్ లక్ష్యమని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే ఈ క్యాంపెయిన్‌ను డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ అంటే జిల్లా కలెక్టర్లు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలతో పాటు పోలీసులు, రెవెన్యూ అధికారులు, ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అంతా కలిసి ఈ ప్రోగ్రామ్‌ను విజయవంతం చేయడానికి ముందుకు వస్తున్నారు. అంటే, రాష్ట్రమంతటా ఒకే రకమైన రూల్స్, ఒకే రకమైన అమలు ఉండేలా చూస్తారు. ఎక్కడైనా టూ వీలర్ మీదా వెళ్లేవారు హెల్మెట్ లేకుండా కనిపిస్తే, ఇక వాళ్లకు పెట్రోల్ పోయడం కష్టమేనన్న మాట.
నిజానికి మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988లోని సెక్షన్ 129 ప్రకారం, టూ-వీలర్ రైడర్‌తో పాటు వెనుక కూర్చునే వాళ్లు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఒకవేళ రూల్ బ్రేక్ చేస్తే, సెక్షన్ 194D ప్రకారం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. సుప్రీం కోర్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ కూడా హెల్మెట్ వాడకం పెంచాలని చాలా సార్లు సూచించింది. అందుకే ఈ క్యాంపెయిన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని చూస్తున్నారు. ఈ క్యాంపెయిన్‌లో పెట్రోల్ బంక్‌లు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. IOCL, BPCL, HPCL వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పెట్రోల్ పంప్ స్టాఫ్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ లేదా డీజిల్ ఇవ్వొద్దు అని స్పష్టంగా తెలిపారు. ఈ విషయాన్ని ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ మానిటర్ చేస్తుంది.
అంటే, హెల్మెట్ లేకుండా బైక్ తీసుకొచ్చి పెట్రోల్ పోయాలని అడిగితే నో చెప్పడం బంక్ సిబ్బంది ధర్మం. మేం ఎవరినీ శిక్షించడానికి ఈ రూల్ తేలేదని, ప్రజల ప్రాణాలు కాపాడడమే మా లక్ష్యమని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ బ్రిజేష్ నారాయణ్ సింగ్ అన్నారు. ఈ కొత్త రూల్ స్పందనను బట్టి పొడిగించడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. నెల రోజుల అమలు తర్వాత వాహనదారులు తప్పకుండా దాన్ని కంటీన్యూ చేస్తారని అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు