TG News: మహిళలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. దేశంలోనే మొదటిసారి!
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రణాళికా సిద్ధం చేశామని సీఎం రేవంత్ అన్నారు. ఇందులో భాగంగానే నారాయణపేట జిల్లా అప్పక్ పల్లిలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.