Ajit Pawar's Death: అజిత్‌ పవార్‌ మరణంపై శరద్‌ పవార్‌ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదంపై NCP అధినేత శరాద్‌ పవార్‌ స్పందించారు. విమాన ప్రమాద ఘటన పూర్తిగా ప్రమాదమేనని అన్నారు. దీన్ని రాజకీయం చేయవద్దంటూ సూచనలు చేశారు.

New Update
Sharad Pawar

Sharad Pawar

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదంలో మరణించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ దుర్ఘటన వెనుక కుట్ర కోణం ఉందటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేయడంతో  తాజాగా దీనిపై  NCP అధినేత శరాద్‌ పవార్‌ స్పందించారు. విమాన ప్రమాద ఘటన పూర్తిగా ప్రమాదమేనని అన్నారు. దీన్ని రాజకీయం చేయవద్దంటూ సూచనలు చేశారు. అజిత్ మరణం దుఃఖాన్ని మిగిల్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  

Also Read: బంగారంపై ట్యాక్స్ తగ్గింపు.. బడ్జెట్ తర్వాత భారీగా తగ్గనున్న ధరలు?

'' రాష్ట్రం ఓ సమర్థుడైన నేతను కోల్పోయింది. జరిగిన నష్టాన్ని పూడ్చలేం. ప్రతీ విషయం మన చేతుల్లో ఉండదు. కొందరు ఈ ఘటనను రాజకీయం చేసేందుకు యత్నిస్తున్నారు. ఇందులోకి రాజకీయాన్ని తీసుకురావద్దు. ఈ ఘటన పూర్తిగా ప్రమాదమే. ఇది నాతో సహా రాష్ట్రం మొత్తానికి దుఃఖాన్ని మిగిల్చింది. ఈ విషాదాన్ని రాజకీయం చేయకూడదని'' శరద్ పవార్ అన్నారు. 

Also Read: హెచ్ 1బీ వీసా దరఖాస్తులను ఆపేయండి..టెక్సాస్ గవర్నర్ కీలక నిర్ణయం

ఇదిలాఉండగా అజిత్ పవార్‌ విమాన ప్రమాద ఘటనపై మమతా బెనర్జీ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. తనకు అత్యున్నత న్యాయస్థానంపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శరద్‌ పవార్‌ తాజాగా మీడియాతో దీనిపై స్పందించారు. ఇలాంటి ఊహాగానాలు ఆపేందుకే తాను మీడియా ముందుకు వచ్చానని స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు