Nirmala Sitharaman : మోదీ బిగ్ స్కెచ్.. బడ్జెట్ ప్రసంగం వేళ నిర్మలా సీతారామన్ మెరూన్ మ్యాజిక్

బడ్జెట్ అంటే కేవలం రాబడి-ఖర్చుల పద్దు మాత్రమే కాదు.. అది దేశ సంస్కృతిని, రాజకీయ వ్యూహాలను కలిపి చెప్పే ఒక వేదిక. ఈసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం పార్లమెంట్ హాల్‌లోకి ఆమె వేసిన అడుగుతోనే సంచలనంగా మారింది.

New Update
bjp

బడ్జెట్ అంటే కేవలం రాబడి-ఖర్చుల పద్దు మాత్రమే కాదు.. అది దేశ సంస్కృతిని, రాజకీయ వ్యూహాలను కలిపి చెప్పే ఒక వేదిక. ఈసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం పార్లమెంట్ హాల్‌లోకి ఆమె వేసిన అడుగుతోనే సంచలనంగా మారింది. ఆ మెరూన్ రంగు కంచి పట్టు చీర.. ఆ హుందాతనం వెనుక ఒక గట్టి పొలిటికల్ మెసేజ్ ఉందనే చర్చ ఇప్పుడు ఢిల్లీ నుంచి చెన్నై దాకా మారుమోగుతోంది.

Also Read :  బడ్జెట్ రోజున గ్యాస్ బాదుడు: కమర్షియల్ సిలిండర్ ధర ఎంత పెరిగిందంటే?

కేంద్ర బడ్జెట్(Union Budget 2026) ప్రవేశపెట్టే ప్రతిసారీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(fm nirmala sitharaman) ధరించే చీర ఒక సాంస్కృతిక, రాజకీయ సందేశాన్ని ఇస్తుంటుంది. ఈసారి ఆమె కాంజీవరం చీరలో కనిపించారు. దీని వెనుక ఉన్న విశేషాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడు సంప్రదాయానికి ప్రతీక అయిన మెరూన్ రంగు కంచి పట్టు చీర (Kanjeevaram) ధరించారు. బంగారు వర్ణం గీతలు, కాఫీ బ్రౌన్ బోర్డర్‌తో ఉన్న ఈ చేనేత చీర, భారతీయ చేనేత కళా వైభవాన్ని చాటిచెబుతోంది.

Also Read :  27 ఏళ్ల తర్వాత ఆదివారం బడ్జెట్.. నిర్మలమ్మ సరికొత్త రికార్డు!

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు

నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ చీరల ద్వారా ఆయా రాష్ట్రాల కళలను ప్రోత్సహిస్తుంటారు. గత ఏడాది బీహార్ ఎన్నికల నేపథ్యంలో అక్కడి మధుబని కళతో కూడిన చీర ధరించగా, 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మంగళగిరి చీరను ఎంచుకున్నారు. ఇప్పుడు తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, ఆమె తన సొంత రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన కంచి పట్టును ధరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, తమిళ సంస్కృతి పట్ల ఆమెకు ఉన్న గౌరవాన్ని, రాజకీయంగా ఆ రాష్ట్ర ప్రజలకు చేరువయ్యే సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

వరుసగా 9 బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు. 10 బడ్జెట్‌లతో అగ్రస్థానంలో ఉన్న మొరార్జీ దేశాయ్ రికార్డుకు ఆమె కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు