Russia Oil:  ట్రంప్ కు భయపడం.. రష్యాతో దోస్తీ ఆపం.. నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన!

ఏది ఏమైనా రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేదే లేదని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.అమెరికా అదనపు సుంకాల భరాన్ని తగ్గించేందుకు కొత్తవ్యూహాలను రూపొందిస్తున్నామని తెలిపారు.దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

New Update
Nirmala Sitharaman

Nirmala Sitharaman

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే ఆరోపణలతో భారత్ అమెరికా అదనపు సుంకాలను వేసింది. దీంతో ఇండియా చమురు కొనుగోళ్లను ఆపేస్తుందా అని చర్చలు నడుస్తున్నాయి. అయితే మరోవైపు భారత్ మాత్రం అమెరికా ఆంక్షలకు తలొగ్గలేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఉంది. అలాగే తమ వాణిజ్యాన్ని మరిన్ని దేశాలకు వ్యాపించేలా చర్యలు తీసుకుంటోంది భారత ప్రభుత్వం. దీనికి సంబంధించి తాజాగా ప్రధాని మోదీ చైనా, జపాన్ పర్యటనలను కూడా చేశారు. అందేులో భాగంగా రష్యా, ఉక్రెయిన్ మరికొంత అధినేతలతో సమావేశమయ్యారు. కొత్త ఒప్పందాలను చేసుకున్నారు.  ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై స్పందించారు. రష్యా చమురు కొనుగోళ్ళపై ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. 

చమురు కొనుగోళ్ళను ఆపం..

మాకు తెలుసు అమెరికా మా మీద ఆగ్రహంగా ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని ఆంక్షలు విధించింది. దాని కోసమే ట్రంప్ భారీగా సుంకాలను కూడా విధించారు. అయినా కూడా భారత్ వెన్కు తగ్గేది మాత్రం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లను కొనసాగిస్తూనే ఉంటుందని తేల్చి చెప్పారు. దేశ సొంత ప్రయోజనాలకు అనుగుణంగా చమురు దిగుమతులు, ఆయిల్ కొనుగోళ్లు ఉంటాయని ఆమె తెలిపారు.  చమురును ఏ దేశం నుంచి కొనుగోలు చేయాలనే నిర్ణయం కేవలం భారత్ మాత్రమే తీసుకుంటుంది. మన దేశ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం ఎంత మాత్రం అనుమతించదని నిర్మలమ్మ అన్నారు. దీని కారణంగా భారీ సుంకాలను అమెరికా విధించింది. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాం. త్వరలోనే అమెరికాకు వస్తువులు ఎగుమతి చేసే ఎగుమతిదారుల కోసం ఉపశమనం కల్పించేందుకు ఉద్దేశించిన ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆమె ధీమా ఇచ్చారు. అమెరికా టారిఫ్ లకు ఎఫెక్ట్ అయి వారందరికీ ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. 

మరోవైపు అమెరికా కూడా తగ్గేదేలేదు అంటోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్, రష్యాలను చైనాకు వదిలేసుకున్నామనే బాధను ప్రకటిస్తూనే..భారత్ పై సుంకాలను విరమించుకోమని చెబుతున్నారు. రష్యా చమురు కొనుగోళ్లను ఆపేస్తే కానీ సుంకాలు ఆగవని చెప్పారు. అలాగే యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్కిన్ కూడా సుంకాల గురించి  మాట్లాడుతూ..ఒకటి రెండు నెలలో భారత్ అమెరికాకు క్షమాపణలు చెబుతుందని లుట్కిన్ అన్నారు. వాళ్ళు అమెరికాను క్షమించమని అడిగి..ట్రంప్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటారని అన్నారు. అలా చేయకపోతే ఆ దేశం 50 శాతం సుంకాలను భరించాల్సి వస్తుందని బెదిరించారు. 

Also Read: Trump Tariffs: మరో రెండు నెలలో భారత్ క్షమాపణలు చెబుతోంది..యూఎస్ కామర్స్ సెక్రటరీ నోటి దురద

Advertisment
తాజా కథనాలు