/rtv/media/media_files/2025/08/16/nia-2025-08-16-10-55-01.jpg)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర లలో తాజాగా ఎన్ఐఏ మరోసారి సోదాలు చేసింది. విజయనగరం ఉగ్ర కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా వీటిని నిర్వహించింది. ఏపీలో అక్కడి పోలీసుల సహకారంతో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ.. పలు డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు, నగదు, అనుమానాస్పద వస్తువులు స్వాధీనం చేసుకుంది. కేంద్ర ప్రుత్వానికి వ్యతిరేకంగా సిరాజ్ అని ఫ్రెండ్స్ కలిసి గ్ర కుట్రకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల క్రితం జూలైలో విజయనగరంలో సిరాజ్ ఉర్ రెహ్మాన్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అతని దగ్గర నుంచి ఐఈడీ తయారీ వస్తువులను స్వాధీనం చేసుకుంది.
రీసెంట్ గా కీలక నిందితుడు అరెస్ట్..
విజయనగరం ఉగ్రకుట్ర కేసులో కీలక నిందితుడు ఎన్ఐఏ(NIA) కు ఢిల్లీలో పట్టుబడ్డాడు. బిహార్‌కు చెందిన అరీఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్‌నుఎన్ఐఏ అధికారులు ఆగస్టు 28న ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఇతను దేశంలోనే ఉంటూ జీహాదీ కార్యకలాపాలకు సిద్ధమైయ్యాడని విచారణలో తేలింది. అయితే నిన్న ఆరిఫ్ దేశం విడిచి పారిపోతుండగా అధికారులు పట్టుకున్నారు. అంతకు ముందు ఆరిఫ్ పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలను సమకూర్చినట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఐఈడీలతో బాంబు పేలుళ్లకు కెమికల్స్‌నుతీసుకెళ్తుండగా ఉగ్రవాదులు సమీర్, సిరాజ్‌లను ఈ ఏడాది మే నెలలో అరెస్ట్ చేసారు. పహల్గాం దాడి జరిగిన కొద్ది రోజులకే ఈ ఉగ్ర దాడి బయటపడడం ఆందోళన రేకెత్తించింది.
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సయ్యద్ సమీర్, సిరాజ్, పరహాన్ మొయినుద్దీన్, బాదర్, అద్నాన్ కురేసి, దిల్షాన్, మొహిషిన్ షేక్, జహీర్ అలియాస్ అమన్ లు నిందితులుగా ఉన్నారు. వీరందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఓ వర్గానికి జరుగుతున్న అన్యాయాలపై వీరంతా చర్చించేవారు. వీరందరికీ సౌదీలో ఉంటున్న అబూ ముసబ్ అనే వ్యక్తి ఉగ్ర సమాచారం ఇవ్వడంతో పాటు ఎక్కడెక్కడ కుట్రలు చేయాలి, ఎలా చేయాలనే అంశంపై సమాచారం అందించేవాడు. దీనికోసం ఎవరికీ అనుమానం రాకుండా సిగ్నల్ యాప్‌లో మాట్లాడుకునేవారు. అదే క్రమంలో బాంబులు తయారీ గురించి వారికి అవగాహన కల్పించాడు. ముసబ్ ఆదేశాల మేరకు ఆన్‌లైన్ ద్వారా పేలుడు పదార్థాలను తెప్పించాడు సిరాజ్. అలాగే సమీర్ అమేజాన్‌లో తెప్పించిన టిఫిన్ బాక్సులు, వైర్లు ఇతర వస్తువుల ద్వారా బాంబులు తయారు చేయడంతో పాటు విజయనగరం జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతంలో ట్రయల్స్ కూడా చేశారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇక్కడ ఒక వర్గం కోసం పనిచేస్తున్నామని నిర్ణయించుకున్న సిరాజ్, సమీర్‌లు జిహాదీ కోసం ప్రాణత్యాగం కూడా చేయాలని కూడా డిసైడ్ అయ్యారు.