GAZA: మరింత యుద్ధం..భూతల దాడులకు దిగిన ఇజ్రాయెల్

గాజాలో పరిస్థితు మరింత ఉద్రిక్తతగా మారాయి. కాల్పుల విరమణ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ఆ నగరంపై వైమానిక దాడులను మొదలెగ్టింది. అయితే ఇప్పుడు నేరుగా ఆ ప్రాంతంలో భూతల సైన్యం కూడా అడుగు పెట్టింది.

New Update
gaza

తమ దేశ బందీలను హమాస్ చెర నుంచి విడిపించేందుకు తీవ్రస్థాయిలో పోరాడుతామని ఇజ్రాయెల్ అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో గాజా తగలబడుతోందని.. ఇజ్రాయెల్ దళాలు ఉగ్రవాదుల స్థావరాలపై ఉక్కు పిడికిలితో విరుచుకుపడుతున్నాయని తెలిపారు. టార్గెట్ పూర్తయ్యే దాకా తాము ఏమాత్రం ఆపేదిలేదని తేల్చిచెప్పారు. ఇంత వరకు ఈ దాడులు వైమానికం వరకే పరిమితం అయ్యాయి. కానీ ఇప్పుడు ఐడీఎఫ్ సైన్యం నేరుగా మళ్ళీ గాజాలోకి ప్రవేశించింది. భూతల దాడులు ప్రారంభించింది. ఇప్పటికే 3.5 లక్షల మంది పాలస్తీనీయులను గాజా స్ట్రిప్‌ నుంచి తరలించామని IDF పేర్కొంది. ఇంకా వేలాదిమంది మిగిలిపోయినట్లు చెప్పింది. ఇప్పుడు వారు కూడా నగరాన్ని విడిచి వెళుతున్నారు. మొత్తానికి గాజాను వల్లకాటి దిబ్బగా మార్చే వరకూ ఇజ్రాయెల్ ఊరుకునేలా కనిపించడం లేదు.

మారణ హోమం కంటిన్యూస్..

గాజాలో ప్రధాన ఆపరేషన్ మొదలైందని ఇజ్రాయెల్ సైనికాధికారులు చెబుతున్నారు. నడిబొడ్డు నుంచి చివరల వరకూ తమ సైన్యాలు బలంగా కదులుతున్నాయని తెలిపారు గాజాలో ఇప్పటికీ 2 వేల మంది హమాస్ ఉగ్రవాదుల ఉన్నట్లు తెలుస్తోందని..అలాగే చాలా రహస్య సొరంగాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇవి మొత్తం నాశనం అయ్యే వరకూ వదిలేదే లేదని మరోసారి స్పష్టం చేశారు. అయితే దీనికి ఎన్ని రోజులు పడుతుంది..తమ ఆపరేషన్ ను ఎప్పటి వరకు కొనసాగిస్తాన్నడీటెయిల్స్ మాత్రం వారు చెప్పడం లేదు. దీనికి నెలలు పట్టొచ్చనిసథానికమీడయా మాత్రం అంచనా వేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాన నెతన్యాహు ఇంటి దగ్గర హమాస్‌ చెరలో ఇంకా బందీలుగా ఉన్నవారి కుటుంబాలు నిరసనలు చేశాయి. తమవారిని వెంటనే విడిపించాలని వారు డిమాండ్ చేశారు. దాదాపు 20 మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ చెరలో ఇంకా బందీగా ఉన్నారని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు