/rtv/media/media_files/2025/02/03/GaoJwl8ruDqNU0NVlJfA.jpg)
BJP
తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతలు కొత్తవారికి అప్పగించనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధ్యక్ష పదవి రేసులో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మరో నేత రామచంద్ర రావు కీలకంగా ఉన్నారు. పాత, కొత్త అనే విభేదాలు వస్తుండటంతో బీజేపీ హైకమాండ్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే అధ్యక్ష పదవి కోసం ఇప్పుడు తెరపైకి ఊహించని కొత్త పేర్లు వచ్చాయి.
Also Read: ఢిల్లీ ఎలక్షన్స్.. కవితతో పాటు చంద్రబాబు, రేవంత్ కు కూడా టెన్షనే.. ఎందుకో తెలుసా?
ప్రస్తుతం మురళీధర్ రావు, డీకే అరుణ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరిలో ఒక్కరికి అధ్యక్ష పదవి ఇస్తే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర శాసనసభాపక్ష నేతగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవి రెడ్డి లేదా వెలమ సామాజిక వర్గానికి వస్తే బీసీల నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: కేసీఆర్ కు బిగ్ షాక్... లీగల్ నోటీసులు పంపిన లాయర్ ఎందుకో తెలుసా....
అయితే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెట్ పదవి ఇవ్వాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈటల రాజేందర్ లేదా ధర్మపురి అరవింద్.. ఈ ఇద్దరిలో ఒకరికి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బీసీకి అధ్యక్ష పదవి దక్కినట్లయితే.. వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన ఉండదని బీజేపీ శ్రేణులు అంటున్నారు. ఇదిలాఉండగా.. మరికొన్ని రోజుల్లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికలకు ముందే బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారా ? లేదా ? అనే దానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: అయోధ్య రామాలయం ప్రధాన పూజరికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
Also Read: ఎన్డీయే, యూపీఏ ప్రభుత్వాలను కలిపి విమర్శించిన రాహుల్ గాంధీ