ఆ పార్టీ నుంచే సీఎం.. అజిత్ పవార్ సంచలన ప్రకటన డిసెంబర్ 5న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ నుంచి సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని ఎన్సీపీ నేత శరద్ పవార్ తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 01 Dec 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి మహారాష్ట్రలో ఇంకా రాజకీయ సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడై వారం దాటినా కూడా సీఎం ఎవరో తేలలేదు. కానీ అనూహ్యంగా బీజేపీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 5న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని పేర్కొంది. కానీ ఇక్కడ ఇంకా సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెర వీడలేదు. ఇప్పటికే ఏక్‌నాథ్ షిండే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అలాగే ముఖ్యమంత్రి పదవిపై ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. Also Read: భారీ ఎన్‌కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి! మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్‌తో బీజేపీ హైకమాండ్ దోబూచులాడుతోంది. ఇప్పటివరకు ఫడ్నవీస్‌కు సీఎం పదవి ఇవ్వొచ్చనే ప్రచారాలు కూడా జరిగాయి. ఆ తర్వాత పుణె ఎంపీ, కేంద్ర సహాయమంత్రి మురళీధర్ పేరు కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అయితే తాజాగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉంటారని తెలిపారు. అలాగే ఇదే పార్టీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా ఉంటారని పేర్కొన్నారు. మరి ఇప్పుడు ఫడ్నవీస్‌కు సీఎం పదవి ఇస్తారా ? లేదా మురళీధర్‌కు ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఫడ్నవీస్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుని పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మరీ బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అలాగే సీఎం పేరును ప్రకటించకుండా.. ప్రమాణస్వీకారం తేదీని ప్రకటించడం గమనార్హం. Also Read: హైబ్రిడ్ మోడల్‌కు పాక్ గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ కండిషన్.. ఏంటంటే? ఇదిలాఉండగా.. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 288స్థానాలకు గానూ 233 సీట్లు సాధించింది. బీజేపీ 132 స్థానాలను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. శిండే శివసేన 57, ఎన్సీపీ అజిత్ 41 పవార్ పార్టీలకు సీట్లు దక్కాయి. ఇక మహా వికాస్ అఘాడి కూటమికి 46 సీట్లు వచ్చాయి. Also Read: రూ. 295 కోసం ఏడేళ్ల పోరాటం..చివరికి ఏమైందంటే! #telugu-news #national-news #maharashtra #devendra-fadnavis మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి