/rtv/media/media_files/l1JVRjMeK0AB66qjXv3s.jpg)
Big Breaking: ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
Also Read: US: బ్రిక్స్ దేశాలపై 100 పర్సెంట్ ట్యాక్స్ విధిస్తా..ట్రంప్!
తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఎన్ కౌంటర్ పై పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నట్లు సమాచారం.
Also Read: Fengal Cyclone: తీరం దాటేసిన 'ఫెంగల్'.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త!
మృతుల్లో మావోయిస్టు కీలక నేత బద్రు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రాద్రి-ములుగు జిల్లాల సరిహద్దుల్లోని గుండాల, కరికగూడెం మండలాల పరిధిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో గ్రేహండ్స్ బలగాలు అడవిలో కూబింగ్ చేపట్టగా... వారికి మావోయిస్టులు కనిపించారు.
Also Read: ట్రంప్ హయాంలో కశ్యప్ పటేల్‌కి కీలక బాధ్యతలు.. ఎవరతను?
14సంవత్సరాలలో అతి పెద్ద
దీంతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరగాయి. ఈ కాల్పుల్లో లచ్చన్న దళానికి చెందిన ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. తెలంగాణలో చాలా కాలంగా మావోయిస్టుల కదలికలు అంతగా లేవని తెలుస్తుంది. పోలీసులు తెలంగాణ సరిహద్దుల్లోని అడవిని జల్లెడ పడుతుండటంతో వారి కదలికలు తగ్గాయి. అడపాదడపా ఎన్‌కౌంటర్లు జరిగినా.. ఈ స్థాయిలో మాత్రం మావోయిస్టులు చనిపోలేదు. సుమారు 14సంవత్సరాలలో ఇదే అతి పెద్ద ఎన్ కౌంటర్ అని తెలుస్తుంది.
Also Read: Harish Rao: రైతుబంధును తీసేయాలని కుట్ర చేస్తున్నారు.. హరీశ్‌రావు ఫైర్
సెప్టెంబర్‌లో ఆరుగురు, ప్రస్తుతం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందటం నక్సల్స్‌కు ఎదురు దెబ్బే అని తెలుస్తుంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలను అలర్ట్ చేశారు. అనుమానస్పద వ్యక్తులు, మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచాలని చెప్పారు.
ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణ్ పూర్ – దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేశ్ అలియాస్ విష్ణు చనిపోయిన సంగతి తెలిసిందే. మెుత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 250కు పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.