హర్యానా సీఎంగా మరోసారి నాయబ్ సింగ్ సైనీ.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

హర్యానా ముఖ్యమంత్రిగా మరోసారి నాయబ్ సింగ్ సైనీ ఎన్నికయ్యారు. పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఆయనవైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. గురువారం సైనీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

nayab singh saini
New Update

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి గెలిచి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై ఆసక్తి నెలకొంది. దీంతో అధిష్ఠానం ఈ అంశంపై చర్చలు జరిపింది. పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన నాయబ్ సింగ్ సైనీ వైపే మొగ్గు చూపింది. ఆయనకు రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించేలా నిర్ణయం తీసుకుంది. బుధవారం బీజేపీ శాసనసభాపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు సైనీని ఏకగ్రీవంగా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. 

Also Read: మరో హిందూ ఆలయంపై దాడి.. సీఎం చంద్రబాబు సీరియస్

రేపే ప్రమాణస్వీకారం

మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, సీనియర్ నాయకులు అనిల్ విజ్ కూడా నాయబ్ సింగ్ సైనీ పేరును ప్రతిపాదించారు. దీంతో సభ్యులందరూ కూడా ఆయన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో హర్యానా ముఖ్యమంత్రిగా సైనీ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.    

Also Read:  దీపావళికి బంపర్‌ బోనాంజా.. 53 శాతానికి డీఏ? 3 నెలల బకాయిలు కూడా!

తీవ్రంగా కృషి చేసిన సైనీ

ప్రస్తుతం దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చిలో బీజేపీ.. అప్పటి సీఎంగా ఉన్న మనోహర్‌లాల్ ఖట్టర్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో నాయబ్‌ సింగ్ సైనీకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు ఆయన తీవ్రంగా కృషి చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులను కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్లుగా వాడుకుంది.

Also Read: వాటి ధరలు పెంపు.. కేంద్రం సంచలన నిర్ణయం!

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్ని పోల్ సర్వేలు అంచనా వేశాయి. కానీ వాటి అంచనాలన్నీ తప్పడంతో హస్తం నేతలు షాకైపోయారు. అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. హర్యానా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇలా వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మొదటి పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించింది. మొత్తం 90 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 48 స్థానాల్లో గెలిచింది. ఇక కాంగ్రెస్ 37 సీట్లలోనే గెలిచి మరోసారి ఓటమిని మూటగట్టుకుంది. 

Also Read: ఖగోళ అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు రాదు!

#telugu-news #haryana #nayab-singh-saini #haryana-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe