Hanuman Temple : మరో హిందూ ఆలయంపై దాడి.. సీఎం చంద్రబాబు సీరియస్

చిత్తూరు జిల్లా మొలకల చెరువు దగ్గర ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యాడు. దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.

New Update
FotoJet (15

Hanuman Temple: తెలుగు రాష్ట్రాల్లో హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఇంతలోనే ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఆలయాన్ని ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా మొలకల చెరువు దగ్గర ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.

ఇది కూడా చూడండి:  Drunkers : మందుబాబుల కోసం డ్రాపింగ్‌ వ్యాన్...కలెక్టర్ కి వినతి పత్రం!

సీఎం చంద్రబాబు సీరియస్..

పునాదులతో సహా ఆలయాన్ని కదిలించి, గేట్లు ధ్వంసం చేశారు. స్థానికులు ఈ విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిని తప్పకుండా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశించారు. ఈ మధ్య కాలంలో హిందూ ఆలయాలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి..

ఇది కూడా చూడండి: Jammu Kashmir ముఖ్యమంత్రిగా ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణస్వీకారం

ఇదిలా ఉంటే తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయంలో చోరీకి యత్నించి ఇద్దరు దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు శబ్ధం రావడంతో స్థానికులు బయటకు వచ్చి.. ఒక దుండగుడుని పట్టుకున్నారు..

ఇది కూడా చూడండి:   Flights: ఎయిర్ ఇండియాతో పాటూ మరికొన్ని విమానాలకు బాంబు బెదిరింపు

సికింద్రాబాద్ ఘటన తర్వాత అంబర్‌పేట మహంకాళి ఆలయంపై కూడా రాళ్ల దాడి జరిగింది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంపై దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఆలయంపై దాడి చేశాడని స్థానికులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుసగా హిందూ ఆలయాలపై ఈ దాడులు జరగుతున్నాయి.

ఇది కూడా చూడండి: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్!

Advertisment
తాజా కథనాలు