/rtv/media/media_files/2025/01/16/i52riqPeI4H7iqQA92Ik.jpg)
balayya boyapati
'అఖండ’ సినిమాలో బాలయ్యను అఘోరగా చూపించిన బోయపాటి శ్రీను.. ఇప్పుడు సీక్వెల్ కోసం ఏకంగా నాగ సాధువులను రంగంలోకి దించాడు.‘అఖండ 2’ టీమ్.. ఒరిజినల్ నాగ సాధువులతో షూటింగ్ చేయడం కోసం మహాకుంభమేళకు బయల్దేరింది. కోట్ల మంది జనం మధ్య మహాకుంభమేళలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.
ఇప్పటికే కుంభమేళాలో అఖండ పాత్ర ఉన్నట్లు, అక్కడి అఘోరాలతో కలిసి తిరుగుతున్నట్లు , త్రివేణి సంగమంలో స్నానం చేసినట్లు కొన్నిషాట్స్ షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం. దర్శకుడు బోయపాటి ఈ షూటింగ్ పై స్పందిస్తూ.." జనవరి 11 నుండి మహాకుంభమేళలోనే షూటింగ్ జరుపుకుంటున్నాం.
Orey boya mentaloda ani kotla mandhi lo #Akhanda2 shooting chestunava...Inka punakalu issa fixxx theaters lo ugipotaru🥵🥵🔥🔥🙏🙏
— Nikhil_Prince🚲 (@Nikhil_Prince01) January 16, 2025
rasi petukoni e cinema tho present vuna kondari star heros records kuda legustai.... Balayyaaaa record la tho Thandavam adestadu 💥💥💥💥 pic.twitter.com/c8VgnOQGKD
Also Read : సైఫ్ పై దాడి వెనుక బిష్ణోయ్ గ్యాంగ్.. వెలుగులోకి సంచలన విషయాలు!
అఘోరాలకు సంబంధించిన సినిమా కాబట్టి ఇక్కడే షూటింగ్ చేసుకొని వెళ్లాలని అనుకున్నాం. ఇక్కడ అఘోరాలతో పాటు నాగసాధువులు అందరినీ కలుస్తాం. 'అఖండ 2' సినిమా ఏంటి అనేదాని గురించి ఇప్పుడు మాట్లాడడానికి ఏమీ లేదు.." అని అన్నారు. ఆయన చెప్పినదాన్ని బట్టి ఈసారి సీక్వెల్ లో డివోషనల్ షాట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న నాలుగో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవెల్ లో రానున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read : సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే