ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని CRPF పబ్లిక్ స్కూల్ బయట పేలుడు జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పేలుడు కేసుని విచారించేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ (NIA) రంగంలోకి దిగింది. అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2 కిలోమీటర్ల వరకు ఈ పేలుడు శబ్ధం వినిపించినట్లు ప్రజలు చెబుతున్నారు. పేలుడు నుంచి వచ్చిన షాక్ వేవ్స్ వల్ల దగ్గర్లో ఉన్న భవనాలు, వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలంలో తెల్లటి పౌడర్ మిశ్రమాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
టెర్రరిస్టుల పనేనా ?
ఈ పౌడర్ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ, ఎన్ఎస్‌జీ బృందాలు సేకరించాయని పేర్కొన్నారు. పేలుడు పదార్థాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయం 7.47 AM గంటలకు సీఆర్‌పీఎఫ్ స్కూల్ బయట మొదట పొగలు వచ్చి ఆ తర్వాత భారీ పేలుడు జరిగింది. బలమైన మెసేజ్ ఇచ్చేందుకే దుండగులు ఈ పేలుడికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది టెర్రరిస్టుల పనేనా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే?
ఘటనాస్థలంలో వైర్లు
ప్రస్తుతం ఎన్‌ఐఏతో పాటు స్పెషల్ సెల్, సీఆర్‌పీఎఫ్, ఎఫ్ఎస్ఎస్, ఎన్‌ఎస్‌జీ బృందాలు ఘటనాస్థలిలో ఆధారాలు సేకరిస్తున్నాయి. ఆ ప్రాంతంలో కొన్ని వైర్లు కూడా కనిపించాయి. వీటిని బాంబు పేలుడుకు ఉపయోగించారా ? లేదా అంతకుముందే అవి అక్కడ పడేసి ఉన్నాయా అనేది దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆ తెల్లటి పౌడర్ మిశ్రమం ఏమై ఉంటుందనేది కూడా విశ్లేషిస్తున్నారు. దీనికి మండించే స్వభావం ఎక్కువగా.. పేలుడు తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉండే ఛాన్స ఉందని భావిస్తున్నారు.
Also Read: మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది?
స్పెషల్ సెల్, ఎన్ఐఏ, సీఆర్‌పీఎఫ్, ఎఫ్ఎస్ఎస్, ఎన్‌ఎస్‌జీ బృందాలు ఘటనా స్థలిలో ఆధారాలు సేకరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆ ప్రాంతంలో కొన్ని వైర్లు కనిపించాయి. వీటిని బాంబు పేలుడుకు ఉపయోగించారా, లేక అంతకుముందు అక్కడ పడేసి ఉన్నాయా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తెల్లటి పౌడర్ మిశ్రమం ఏమై ఉంటుందనే దానిని కూడా విశ్లేషిస్తున్నారు. దీనికి మండించే స్వభావం ఎక్కువగా, పేలుడు తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆధునిక పరిజ్ఞానంతో ఏరియా మొత్తాన్ని ఎన్‌ఎస్‌జీ మ్యాపింగ్ చేస్తోంది. బాంబు పెట్టిన వ్యక్తిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
Also Read: వణికిస్తున్న బాంబు బెదిరింపులు.. ఎయిర్ లైన్స్‌కి ఎంత నష్టమంటే?
ఢిల్లీ సీఎం అతిషి ఏమన్నారంటే
ఈ పేలుడు ఘటనపై ఢిల్లీ సీఎం అతిషి కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఢిల్లీలో శాంతి భద్రతలకు జవాబుదారీ కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఢిల్లీలో సెక్యూరిటీ వ్యవస్థను తాజా పేలుడు ఘటన బహిర్గతం చేస్తోందని ఆరోపించారు. శాంతి భద్రతల బాధ్యత బీజేపీ సారథ్యంలోని కేంద్రానిదేనని.. కానీ బీజేపీ దాన్ని వదిలేసి ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. దీనివల్లే 1990 ముంబై పేలుళ్ల నాటి పరిస్థితి ఈరోజు ఢిల్లీలో వచ్చిందన్నారు.
Also Read: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..