Narendra Modi : బీజేపీ అభ్యర్థి కాళ్లు మొక్కిన మోదీ.. వీడియో వైరల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ స్టేజీపైనున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగి , మోదీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. వెంటనే అతడ్ని పైకి లేపిన మోదీ మూడు సార్లు అభ్యర్థి కాళ్లకు నమస్కరించారు.

New Update
Modi touches Ravindra Negi's feet

Modi touches Ravindra Negi's feet

Narendra Modi : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రచారానికి గడువు దగ్గర పడుతుండటంతో బీజేపీ, ఆప్, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహిస్తూ హోరెత్తిస్తున్నారు.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. అయితే స్టేజీపైనున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగి , మోదీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. వెంటనే అతడ్ని పైకి లేపిన మోదీ మూడు సార్లు అభ్యర్థి కాళ్లకు నమస్కరించారు.

Also Read: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!

గతంలోనూ కొందరు నాయకులు ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రయత్నిస్తే, మోదీ వద్దని వారించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రవీంద్ర సింగ్ నేగి పట్పర్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  గతంలో కూడా ఈయన పట్పర్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆప్ నేత మనీష్ సిసోడియాపై ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఆప్ నుంచి విద్యావేత్త అవధ్ ఓజాకు ఈ స్థానం నుంచి టిక్కెట్టు దక్కగా...  నేగి ఆయనపై పోటీ చేస్తున్నారు. 

ఒక ప్రధానమంత్రి ఇంత పెద్ద వేదికపై ఓ అభ్యర్థి పాదాలను బహిరంగంగా తాకడం అనేది మామూలు విషయం కాదు. ఈ క్రమంలో మోదీ ఆయన పాదాలు ఎందుకు తాకారనేది ఇప్పుడు అందరిలో సందేహం నెలకొంది. రవీంద్ర నేగి ఉత్తరాఖండ్ లోని జగేశ్వర్‌కు చెందినవారు. ఆయన కుటుంబం చాలా కాలంగా ఢిల్లీలో నివసిస్తుంది. ఢిల్లీలో రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభించిన తరువాత రవీంద్ర సింగ్ నేగీకి ఉత్తరాఖండ్ బీజేపీలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన 25 లక్షల మంది ప్రజలు ఢిల్లీలో నివసిస్తున్నారు. వారిలో 15 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు.

Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

2023 అక్టోబర్ 12 న ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జగేశ్వర్ ఆలయానికి హాజరయ్యారు. జగేశ్వర్ ధామ్ అనేది శివత్వానికి సంబంధించిన ప్రదేశం. జగేశ్వర్‌లో మొదటి శివాలయం ఉందని భక్తులు నమ్ముతారు, ఇక్కడ లింగ రూపంలో ఉన్న శివుడిని ఆరాధించే సంప్రదాయం ప్రారంభమైంది. జగేశ్వర్ ధామ్‌లో 124 చిన్న, పెద్ద దేవాలయాల సమూహం కూడా ఉన్నాయి. జగేశ్వర్ కూడా శివుని పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది.

Also Read :  ఒకే టైటిల్‌తో ఇద్దరు హీరోల సినిమాలు.. ఇంకో బిగ్ ట్విస్ట్ ఏంటంటే!

Advertisment
తాజా కథనాలు