/rtv/media/media_files/2025/01/29/DHLwMyBc6rvbdbkPP6TC.jpg)
Sivakarthikeyan and Vijay Antony Photograph: (Sivakarthikeyan and Vijay Antony)
PARASHAKTHI: విజయ్ ఆంటోనీ(Vijay Antony) హీరోగా అరుణ్ ప్రభు(Arun Prabhu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పరాశక్తి. 2025 జనవరి 29వ తేదీ బుధవారం రోజున మేకర్స్ అధికారికంగా టైటిల్ ప్రకటించారు. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అదే టైటిల్‌తో హీరో శివ కార్తికేయన్(Shiva Krthikeyan) కొత్త సినిమా నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చింది. సుధా కొంగర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఇద్దరు హీరోలకూ ఇది 25వ చిత్రం కావడం విశేషం.
Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో తొక్కిసలాటతో స్పెషల్ రైళ్లు రద్దు.. రైల్వేశాఖ క్లారిటీ!
#Parasakthi
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 29, 2025
Telugu title teaser - https://t.co/UJDOF1QjhG pic.twitter.com/qotrr3Tvtd
ఇద్దరు హీరోలు ఒకే టైటిల్ తో సినిమా చేయడంతో దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. రెండు మూవీ టీమ్స్ కావాలనే ఇలా చేశారా లేకా ఇది అనుకోకుండా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఒకే టైటిల్ ఒకే సమయంలో ఇద్దరికీ ఇవ్వడం అనేది కూడా అసాధ్యం. మరి ఇది ఎలా జరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఒక టైటిల్ తో మూవీ వచ్చాక రూల్స్ ప్రకారం కొన్నేళ్ల వరకు అదే టైటిల్ తో సినిమా రాకూడదు. ఓ పాతికేళ్ల తరువాత ఆ టైటిల్ ను వాడుకునే అవకాశం ఉంది.
புயலடிக்கிற வேகத்தில் புழுதி குப்பைங்க இருக்குமா🔥
— vijayantony (@vijayantony) January 29, 2025
இவன் நடக்குற வேகத்த சகுனிக்கூட்டம் தாங்குமா👺#VA25 @ArunPrabu_ @vijayantonyfilm pic.twitter.com/XCxjv95UVH
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!
ఏ సినిమా ముందుగా రిలీజ్?
సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ నటిస్తున్న ఈ సినిమాను డాన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శ్రీలల హీరోయిన్ గా నటిస్తోంది. రవిమోహన్, అధర్వ తదితరులు కీలక ప్రాత్రల్లో నటించనునన్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. తెలుగులో కూడా ఇదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. విజయ్ ఆంటోని సినిమాకు తెలుగులో పరాశక్తి అనే టైటిల్ మాత్రమే పెట్టారని, అందుకే శివకార్తికేయన్ పరాశక్తి టైటిల్‌లో ఎలాంటి మార్పు ఉండదని కొందరు అంటున్నారు. ఇందులో ఏ సినిమా ముందుగా రిలీజ్ అవుతుంది అనేది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read : జూ.ఎన్టీఆర్ను మళ్లీ అవమానించిన బాలయ్య.. ఫొటోలు వైరల్!