PM Modi birthday: ప్రధాని హోదాలో మోదీకి ఇదే చివరి పుట్టినరోజు కానుందా.. BJP బిగ్ షాక్ ఇవ్వనుందా?

ప్రధాని మోదీ నేడు 75 పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే దేశ రాజకీయాల్లో కొన్ని ఆసక్తికరమైన చర్చలు కూడా మొదలయ్యాయి. మోదీకి ప్రధాని హోదాలో ఇదే చివరి పుట్టినరోజు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

New Update
modi

ప్రధాని మోదీ 2025 సెప్టెంబర్ 17న 75 పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ పుట్టినరోజుతో పాటు దేశ రాజకీయాల్లో కొన్ని ఆసక్తికరమైన చర్చలు కూడా మొదలయ్యాయి. మోదీకి ప్రధాని హోదాలో ఇదే చివరి పుట్టినరోజు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలో అనధికారికంగా అమలవుతున్న '75 సంవత్సరాల రిటైర్మెంట్' రూల్. నరేంద్ర మోదీ 13ఏళ్లుగా ప్రధాన మంత్రి బాధ్యతల్లో కొనసాగుతున్నారు.

75ఏళ్ల నియమం.. యాక్టీవ్ పాలిటిక్స్ బ్రేక్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) లేదా దాని అనుబంధ సంస్థలలో ఉన్న నాయకులకు 75 సంవత్సరాలు దాటిన తర్వాత క్రియాశీల రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలనే ఓ అనధికారిక నియమం ఉంది. గతంలో బీజేపీలో ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ నాయకులను ఇదే నియమం పేరుతో ‘మార్గదర్శక్ మండలి’లోకి పంపించారు. ఈ రూల్ కారణంగానే ప్రధాని LK అద్వానీకి ప్రధాని పదవి దక్కలేదు. ప్రస్తుతం మోదీ కూడా 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతుండటంతో, ఈ నియమం ఆయనకు కూడా వర్తిస్తుందా లేదా అనే చర్చ ఊపందుకుంది.

RSS, బీజేపీల స్పందన:
ఈ అంశంపై RSS అధినేత మోహన్ భగవత్ గతంలో స్పష్టత ఇచ్చారు. 75 సంవత్సరాల వయసులో పదవి నుండి తప్పుకోవాలనే నియమం లేదని ఆయన పేర్కొన్నారు. తమ సంస్థలో స్వయంసేవకులకు అప్పగించిన పనిని ఎప్పుడు చేయమంటే అప్పుడు చేస్తారని, వయసుతో సంబంధం లేదని ఆయన చెప్పారు. అలాగే, బీజేపీ కూడా ఈ రూల్‌ను తోసిపుచ్చింది. హోం మంత్రి అమిత్ షా గతంలో మోదీ 2029 వరకు ప్రధానిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ప్రస్తుత కేంద్ర కేబినెట్‌లో 80 ఏళ్లకు పైబడిన నాయకులు కూడా ఉన్నారని, దీనివల్ల వయసు నియమానికి ప్రాధాన్యత లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

#latest-telugu-news #bjp #rss #modi-birthday-special #birthday-wishes #pm modi
Advertisment
తాజా కథనాలు