/rtv/media/media_files/2025/06/23/pocso-case-registered-against-boy-for-sexually-assaulting-five-year-old-girl-in-nandyal-2025-06-23-07-36-19.jpg)
Minors involved in s...The girl died
Crime: సోషల్ మీడియా పుణ్యమా అని తెలిసితెలియని వయసులోనే పిల్లలు అన్ని తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా అశ్లీల దృశ్యాలు, చిత్రాలు చూసి చేయకూడని తప్పులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. బీహార్ పాట్నాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. జెహానాబాద్‌కు చెందిన మైనర్ బాలిక తన స్నేహితుడు అయిన మరో మైనర్ బాలుడితో సె..చేసింది. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో ఆమె మరణించింది.
ఇది కూడా చూడండి: Smartphone Offers: ఇదేక్కడి మాస్ రా మావా.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 5జీ ఫోన్ ఇంత చీపా.. ఓ లుక్కేయండి బాసూ!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మైనర్ బాలిక, బాలురు ఇద్దరూ పది రోజుల క్రితం బీహార్ పాట్నాలోని జెహానాబాద్ రైల్వే స్టేషన్‌లో కలుసుకున్నారు. ఆ సమయంలో ఒకరి నెంబర్లు ఒకరు ఇచ్చి పుచ్చుకున్నారు. ఇటీవల బాలుడు ఆమెకు కాల్ చేశాడు. ఆమెను జక్కన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్బిగాహియా ప్రాంతంలో ఉన్న స్నేహితుడి గదికి రమ్మని కోరాడు. ఆమె కూడా అందుకు అంగీకరించింది. ఆ గదిలో కలుసుకున్న వారిద్దరూ లైంగిక సంబంధం సమయంలో బాలికకు తీవ్ర రక్తస్రావం అయింది. దీంతతో బయపడిన బాలుడు అతని స్నేహితుడు ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH)కి రిఫర్ చేయగా.. చికిత్స పొందుతూ చనిపోయింది.
ఇది కూడా చూడండి:Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు
విషయం తెలిసిన పోలీసులు బాలుడు, అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. విచారణ కొనసాగుతోంది. స్టేట్‌మెంట్లు నమోదు చేసిన తర్వాత ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.
ఇది కూడా చూడండి:Kota Srinivasa Rao: ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?