రాష్ట్రంలో అర్హులైన ప్రతి మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రకటన చేశారు. రాష్ట్రం అప్పుల కుప్పగా ఉన్నా మహిళా సాధికారత కోసం ఇచ్చిన మాట ప్రకారం దీపం 2.0ను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. ప్రతిపక్షం విమర్శలు మాని క్షేత్రస్థాయిలో పరిశీలించి సలహాలు, సూచిస్తే మంచిదని ఆయన సూచించారు. తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో దీపం 2.0 ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లను ఆయన నేరుగా అందించారు.
Also Read: రుషికొండ ప్యాలెస్ పై చంద్రబాబు సంచలనం నిర్ణయం.. ఏం చేయబోతున్నారంటే!
గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు
వైసీపీ ఐదేళ్ళ పాలనలో 11లక్షల కోట్ల అప్పులయ్యాని పేరికొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు దీపం 2.0 అమలు చేస్తున్నామని తెలిపారు. మార్చి వరకు అర్హులైన ప్రతి మహిళా.. గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. మూడురోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 12లక్షల మంది గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారని ఆయన చెప్పారు.
Also Read: మాజీ ఎంపీ గోరెంట్లపై మరో ఫిర్యాదు.. అసభ్యకరంగా..
గ్యాస్ సిలిండర్ డెలివిరి అయిన వెంటనే లబ్దిదారులకు నగదు బ్యాంకు ఖాతాలో పడేలా ప్రధాని ఉజ్జ్వల యోజన పథకంలో మార్పులు చేస్తామని పేర్కొన్నారు. సంక్షేమం పేరిట గత ప్రభుత్వం బటన్‌లు నొక్కితే తాము నాలుగు నెలల్లోనే ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త రేషన్ కార్డులను కూడా త్వరలోనే అందిస్తామని స్పష్టం చేశారు.
Also Read: ఢిల్లీలో తీవ్ర కాలుష్యం.. కలుషిత వాటర్ బాటిల్‌తో ఎంపీ నిరసన
Also Read: ఇంట్లో దొంగలు పడ్డారు వెంటనే రండి సర్.. తీరా చూస్తే పోలీసులు షాక్!