రుషికొండ ప్యాలెస్ పై చంద్రబాబు సంచలనం నిర్ణయం.. ఏం చేయబోతున్నారంటే!

విశాఖ రుషికొండ ప్యాలెస్ పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రుషికొండ పూర్తి వివరాలు ప్రజలకు అందించి ప్యాలెస్ ప్రజా సందర్శనార్థం అనుమతి ఇస్తామన్నారు. ఇక ప్రజల సొమ్ముతో ఇంతటి విలాసవంతమైన భవనం కట్టుకున్నాడంటూ జగన్ పై మండిపడ్డారు. 

author-image
By srinivas
New Update
d awe

Rishikonda: విశాఖ రుషికొండ ప్యాలెస్ చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమేనా అని అనిపిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒక వ్యక్తి ఇంతటి విలాసవంతంగా ఉంటాడా అని ఆశ్చర్యమేస్తుందన్నారు. శనివారం రిషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన చంద్రబాబు.. ఎవ్వరిని ఇక్కడకు రానివ్వలేదని, పర్యావరణ ప్రేమికులు కూడా ఇక్కడ రాకుండా చేశారని మండిపడ్డారు. తాను, తన మిత్రుడు పవన్ కళ్యాణ్ రావడానికి ప్రయత్నం చేస్తే చూడనివ్వలేదని, ఎన్నో దేశాలు తిరిగిన తాను ఇలాంటి పాలకులను చూడలేదన్నారు. 

కరుడు కట్టిన నేరస్తుడి అరాచకం.. 

‘సీఎం విలాసం కోసం పర్యవరణం విధ్వంసం చేశారు. మైసూర్, విజయనగర చంద్రగిరి ప్యాలెస్ లు చూసాం. ఇప్పుడు ఎవ్వరు కట్టడం లేదు. ఇది చూసిన ప్రతి ఒక్కరికి మొదట ఆశ్చర్యం కలుగుతుంది. తర్వాత ఆవేదన వస్తుంది. ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్వహణ చెయ్యలేదు. కానీ రూ. 400 కోట్లు ఖర్చు చేశారు. పైగా ఈ ప్యాలెస్ లో ప్రధాని, రాష్ట్రపతి వినియోగం కోసం అంటున్నారు. వాళ్ళు చిన్న గదుల్లో ఉన్నారు. వారి పేరుకి ఇబ్బంది తెస్తున్నారు. బాత్ టబ్ 36 లక్షలు. వాడ్ రోబ్ 12 లక్షలు ఖర్చు చేశారు. కొండ మొత్తం 18 ఎకరాలు అక్రమించారు.ఈ భవనం ఎదురుగా బ్లూ ఫాగ్ బీచ్ ఉంది. వైట్ హౌస్ లో కూడా ఇలా లేదు. 300 సీట్లు కాన్ఫరెన్స్ హాల్ కట్టారు.100 కెవి సబ్ స్టేషన్, 200 టన్నులు ఏసీ స్టేషన్. ఫ్యాన్ లు కూడా లేటెస్ట్ మోడల్. సర్వ్ రాళ్ల కోసం 700 కోట్లు ఖర్చు చేశారు. మంచినీళ్లు మాదిరి డబ్బు ఖర్చు చేసారు. అందరిని మభ్య పెట్టారు. అధికారులను బెదిరించారు. ఒక కరుడు కట్టిన నేరస్తుడికి ఒక ఎస్కో బార్. ఇలాంటి వాళ్ళు రాజకీయంలో పనికి రారు. పేదలకు పెత్తందారికి యుద్ధం అంటారు. పేదల పేరు చెప్పి ఇంత విలాస వంతమైన భవనం కట్టాడు. ఈ 500 కోట్లు పెడితే గుంతలు పూడ్చే వాళ్ళమని చంద్రబాబు అన్నారు.  

ఇది కూడా చదవండి: BREAKING: డిసెంబర్ లో సర్పంచ్ ఎన్నికలు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ప్రజా సందర్శనార్థం అనుమతి..

ఇక రిషికొండ అవినీతిపై చర్చ జరగాలని, దీనిని ప్రజా సందర్శనార్థం అనుమతి ఇస్తామన్నారు. ఎంత ఖర్చు పెట్టారో ప్రజలకు తెలుపుతాం. ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టారు. చెత్త మాటలు మాట్లాడే వారు సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ఎవ్వరు శాశ్వతం కాదు. విశాఖను మోసం చేసారు. రాజధాని ఇక్కడ పెడుతున్నామన్నారు. ప్రజలను మోసం చేశారు. రాష్ట్రంలో అతి ఎక్కువ మెజార్టీ ఇక్కడ ప్రజలు ఇచ్చారు. ప్రజలు మాపై పెట్టుకున్న నమకాన్ని నిలబెట్టాలి అనుకున్నాం. ఇది అందరిని విస్మరించే సంఘటన. త్వరలోనే రుషి కొండ పూర్తి వివరాలు ప్రజలకు అందిస్తాం. దీనిపై ప్రజా అభిప్రాయాలు సేకరిస్తాం. ప్రజలంతా తమ అభిప్రాయాలు చెప్పాలని కోరారు. 

ఇది కూడా చదవండి: మోదీ మీకు దండం.. మా బకాయిలు క్లియర్‌ చేయండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు