చాగంటి కోటేశ్వరరావుకు సీఎం చంద్రబాబు కీలక సూచన.. అలా చేయాల్సిందే! ఏపీ రాష్ట్ర నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు సీఎం చంద్రబాబు కీలక సూచన చేశారు. విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. నైతిక విలువలు పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. By Seetha Ram 25 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రముఖ ఆధ్మాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వం ఇటీవల కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే తాజాగా సచివాలయంలో చాగంటి కోటేశ్వరరావుని సీఎం చంద్రబాబు సన్మానించారు. Also Read: కోరిక తీర్చాలంటూ మహిళకు SI వేధింపులు..! భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్‌తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని తెలిపారు. ఇవన్నీ ఉన్నప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని.. ఆ దిశగా అందరూ కృషి చేయాలన్నారు. Also Read: రూ.1200కోట్ల సినిమా మిస్ చేసుకున్న సామ్.. అందులో హీరో ఎవరో తెలుసా..! ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి తనను సచివాలయంలో సోమవారం కలిసిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు. Also Read : అదానీకి రేవంత్ బిగ్ షాక్.. సంచలన నిర్ణయం! స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయొచ్చని అన్నారు. ప్రపంచంలో మరే దేశానికి లేని ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలు మన సొంతం అని.. వాటిని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లితండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలన్నారు. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయని నైతిక విలువల పతనానికి ఇవి కారణం అవుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. సుమతీ-వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్ధులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేష్‌తో చర్చించానని ఆయన తెలిపారు. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన తరువాత తొలిసారి తన వద్దకు వచ్చిన చాగంటి కోటేశ్వరరావు యోగక్షేమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటేశ్వరావును సీఎం చంద్రబాబు శాలువాతో సత్కరించి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు. Also Read: ఎట్టకేలకు బయటపడ్డ విజయ్ - రష్మిక సీక్రెట్ రిలేషన్.. ఒక్క ఫొటోతో క్లారిటీ #chaganti-koteswararao #ap minister nara lokesh #cm-chandra-babu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి