Supreme Court: మెడికల్ సీట్లు ఖాళీగా ఉంచకండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

మెడికల్ సీట్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ సీట్లు ఖాళీగా ఉంచకూడదని స్పష్టం చేసింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

New Update
Supreme Court

Supreme Court

మెడికల్ సీట్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ సీట్లు ఖాళీగా ఉంచకూడదని స్పష్టం చేసింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచనలు చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. వైద్య విద్యకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో దాదాపు వెయ్యి సీట్లకు పైగా ఖాళీ ఉండటంపై గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలైంది. 

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

2023 ఏప్రిల్‌లో దీనిపై విచారించిన సుప్రీంకోర్టు వెయ్యికి పైగా మెడికల్ సీట్లు ఖాళీ ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓవైపు ఇలా సీట్లు మిగిలిపోవడం.. మరోవైపు సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వైద్యుల కొరత ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిపై పరిశీలించేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు, ప్రైవేటు మెడికల్ కాలేజీల ప్రతినిధులతో కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ తాజాగా కొన్ని సిఫార్సులు చేసింది. దీంతో కేంద్రం వీటిని అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది.     

Also Read: మహాకుంభమేళాకు వెళ్లేవారికి బిగ్ అప్‌డేట్.. ఐఎండీ కీలక ప్రకటన

దీనికి సంబంధించిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. మెడికల్ సీట్లు ఖాళీగా ఉంచకూడదని స్పష్టం చేసింది. వివిధ భాగస్వామ్య పక్షాలతో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పింది. ఆ తర్వాత ఓ కచ్చితమైన ప్రతిపాదనతో వస్తే బాగుంటుందని తెలిపింది. ఈ ప్రక్రియను మూడు నెలల్లోనే పూర్తి చేయాలని ఆదేశించింది. తర్వాతి విచారణను ఏప్రిల్‌లో చేపడతామని స్పష్టం చేసింది.  

Also Read: నేను అద్దాల మేడ కట్టుకోలేదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు