Telangana: పీజీ వైద్య కళాశాలల్లో ప్రవేశానికి సంబందించి తెలంగాణ రాష్ట్ర ఎంబీబీఎస్, బీడీఎస్, BAMS, BHMS విద్యార్థులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ కల్పించింది. ఉన్నత వైద్య విద్య కోసం ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన తెలంగాణ విద్యార్థులను లోకల్స్ గా పరిగణించాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా
తెలంగాణలో చదివిన అందరు లోకల్సే
అయితే 2021లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మెడికల్ కాలేజీల పీజీ అడ్మిషన్లకు సంబంధించి జారీ చేసిన జీవో 148, జీవో 149 వివరణ 2లో 8-12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులను మాత్రమే స్థానికులుగా పరిగణించాలని పేర్కొంది. కేవలం ఎంబీబీఎస్ మాత్రమే తెలంగాణలో పూర్తి చేసిన విద్యార్థులు, అలాగే ఆలిండియా కోటాలో తెలంగాణలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన రాష్ట్రేతర విద్యార్థులు స్థానిక కోటాకు అర్హులు కాదని ఈ జీవో ఉద్దేశం.
ఇది కూడా చూడండి: ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ
కాగా, దీనిని సవాలు చేస్తూ 135 మంది వైద్య విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్థానికతకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను కొత్తగా రూపొందించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం సవరణల కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఇప్పుడు ఈ జీవోను సవరించిన ప్రభుత్వం.. నాన్-లోకల్ కోటాతో సంబంధం లేకుండా తెలంగాణలో ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎ్‌స పూర్తిచేసిన వారంతా.. పీజీ మెడికల్ కోర్సుల్లో స్థానిక కోటాకు అర్హులని ప్రకటించింది.
ఇది కూడా చూడండి: 2024లో ప్రపంచాన్ని వణికించిన భయంకరమైన వ్యాధులివే.. ఇందులో మీకు ఏదైనా సోకిందా?
ఇది కూడా చూడండి: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జనవరి నుంచే ఉచిత భోజనం