Mayawati: మాయావతి సంచలన నిర్ణయం.. ఏకంగా మేనల్లుడినే ..?

బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ను పార్టీకి చెందిన అన్ని పదవుల నుంచి తొలిగిస్తున్నట్లు ఆదివారం ప్రకటన చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Mayawati removes nephew Akash Anand from all party posts

Mayawati removes nephew Akash Anand from all party posts

బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ను పార్టీకి చెందిన అన్ని పదవుల నుంచి తొలిగిస్తున్నట్లు ఆదివారం ప్రకటన చేశారు. ఇప్పటివరకు తన రాజకీయ వారుసుడు ఆకాశ్‌ అని చెప్పుకున్న మాయావతి తాజాగా ఆయన్ని పార్టీ బాధ్యతల నుంచి తొలగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయన తండ్రి ఆనంద్‌ కుమార్‌ను, రాజ్యసభ ఎంపీ రామ్‌జీ గౌతమ్‌ను కొత్త జాతీయ స్థాయి సమన్వయకర్తలుగా నియమించారు. 

Also Read: ఇంత స్పీడున్నారేంట్రా బాబు- నాలుగు నిమిషాల్లో ATM లూటీ.. లక్షల్లో దోచేసి..!

బీఎస్పీ విధానాలకు ఎవరైనా హానీ కలిగిస్తే.. వెంటనే పార్టీ నుంచి తొలగిస్తానని మాయావతి స్పష్టం చేశారు. గతంలో పార్టీ బలాన్ని బలహీనం చేసేందుకు యత్నించిన ఆకాశ్‌ మామ అశోక్‌ సిద్ధార్థ్‌ను బహిష్కరించినట్లు గుర్తుచేశారు. తాజాగా తన మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ను కూడా పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నానని చెప్పారు. అశోక్ సిద్ధార్థ్ చర్యలు ఇప్పటికే ఆకాశ్‌ రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తోందని.. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

Also Read: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !  

ఉత్తరప్రదేశ్‌లో బహుజనులు అభివృద్ధి చెందడం రాష్ట్రానికే కాకుండా దేశాభివృద్ధికి అవసరమని అన్నారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌ జన్మదిన వేడుకలకు సంబంధించిన ప్రణాళికల గురించి మాయావతి వివరించారు. ఆయన సిద్ధాంతాలను పార్టీ ఎప్పటికీ పాటిస్తూనే ఉంటుందని తెలిపారు. అయితే ఇప్పుడు మేనల్లుడినే మాయావతి పార్టీ బాధ్యతల నుంచి తప్పించడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. 

Also Read: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని 37 మంది మృ‌తి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు