Bolivia Bus Crash: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని 37 మంది మృ‌తి

ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొని 37 మంది ప్రయాణికులు మరణించారు. మరో 39 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన దక్షిణ అమెరికా దేశం బొలివియాలోని పొటోసిలో చోటుచేసుకుంది. కార్నివాల్ వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది.

New Update
road accident in Bolivia

road accident in Bolivia Photograph: (road accident in Bolivia)

ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొని 37 మంది ప్రయాణికులు మరణించారు. మరో 39 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన దక్షిణ అమెరికా దేశం బొలివియాలోని పొటోసిలో చోటుచేసుకుంది. స్థానికంగా జరుగుతున్న కార్నివాల్ వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. డ్రైవర్లలో ఒకరు ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారని, మరొకరి పరిస్థితి స్థిరంగా ఉందని పోలీస్ కమాండర్ విల్సన్ ఫ్లోర్స్ తెలిపారు. ఇద్దరు డ్రైవర్లపై నిర్వహించిన ఆల్కహాల్ పరీక్షల ఫలితాల కోసం స్థానిక అధికారులు ఎదురు చూస్తున్నారు. గాయపడిన వారిని ఒరురో, పోటోసిలోని ఆసుపత్రులకు తరలించారు.

అతి వేగంగా వచ్చి ఢీకొనడం వల్ల బస్సులో ఉన్న లగేజీ బ్యాగ్‌లు చెల్లా చెదురుగా పడ్డాయి. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. బొలీవియాలోని ఉయునికి 5 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. చనిపోయిన వారిని ఇంకా గుర్తించలేదు.

Also read; Uttarakhand: నలుగురు కార్మికులు మృతి.. మరో నలుగురి కోసం గాలింపు

ఫిబ్రవరి 18నే బస్సు లోయలో పడి 31 మంది మృతి చెందారు. జనవరిలో అదే ప్రాంతంలో బస్సు రోడ్డు పక్కనే పడిపోవడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతుంటాయి. సంవత్సరంలో సగటున 1400 మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లే సంభవిస్తాయి.

Also Read: Ukraine: మా ఆవేదనను వినండి-జెలెన్ స్కీ 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు